
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటినుంచి రెండు రోజుల పాటు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శుక్రవారం ఉదయం జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని సింద్రీకి మోదీ చేరుకుంటారు. రాష్ట్రంలో 35,700 కోట్ల రూపాయల విలువైన ఎరువుల పరిశ్రమ, రైల్వేలు, విద్యుత్, బొగ్గు రంగాలకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు.. సింద్రీలో ఉన్న హిందుస్థాన్ ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (HURL) ఫర్టిలైజర్ ప్లాంట్‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ ఎరువుల కర్మాగారాన్ని 8900 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి చేశారు. ఇది దేశంలో దేశీయ యూరియా ఉత్పత్తిని సంవత్సరానికి సుమారు 12.7 LMT పెంచుతుంది. గోరఖ్‌పూర్, రామగుండంలో ఎరువుల ప్లాంట్ల పునరుద్ధరణ తర్వాత దేశంలో పునఃప్రారంభించబడిన మూడవ ఎరువుల కర్మాగారం HURL ప్లాంట్ కానుంది.
కాగా.. ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్రమోందీ జాతికి అంకితం చేయనున్న సింద్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్.. ఎంతో కాలం నుంచి మూసి ఉంది.. మోడీ ప్రభుత్వం దానిని పునరుద్ధరించాలని నిర్ణయించుకునే ముందు చాలా కాలం పాటు దానిని తెరవాలనే డిమాండ్ స్థానికుల నుంచి వచ్చింది.. అయితే, దీనిని పునరుద్ధరించేందుకు నరేంద్రమోదీ 2018లో శంకుస్థాపన చేశారు. అప్పట్లో జార్ఖండ్‌లో జరిగిన బహిరంగ సభలో కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మోదీ.. తూర్పు భారతదేశంలో ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణకు తన ప్రయత్నాలలో భాగమైన సింద్రీ ఎరువుల ప్రాజెక్ట్ పునరుద్ధరణ చేయనున్నట్లు తెలిపారు. కాగా.. ఎరువుల కర్మాగారం.. గోరఖ్‌పూర్, రామగుండంలో ఎరువుల ప్లాంట్ల పునరుద్ధరణ తర్వాత దేశంలో పునరుద్ధరణకు గురైన 3వ ఎరువుల కర్మాగారం.. దీని ద్వారా యూరియా కొరతను నివారించవచ్చు.. కాగా.. అప్పుడు మోడీ ఇచ్చిన హామీ నేటితో పూర్తి కానుంది. ఈ సందర్భంగా మోదీకి సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది.. మోదీ గ్యారెంటీ పక్కా అంటూ బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నారు.
The foundation stones for key development projects were laid during the public meeting in Jharkhand. This includes the revival of the Sindri Fertiliser Project, which is a part of our efforts to revive fertiliser plants in Eastern India. pic.twitter.com/MjLwHZgP1e
— Narendra Modi (@narendramodi) May 25, 2018
ఈ పర్యటనలో.. వర్చువల్ మోడ్ ద్వారా 17,600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అనేక రైల్వే ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. 660 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో చత్రా వద్ద నార్త్ కరణ్‌పురా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) మొదటి యూనిట్‌తో సహా దేశంలోని ముఖ్యమైన పవర్ ప్రాజెక్టులకు కూడా మోదీ అంకితమివ్వనున్నారు. 7500 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేశారు. దీంతో పాటు జార్ఖండ్‌లోని బొగ్గు రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. దీని తర్వాత, ధన్‌బాద్‌లోని బర్వాద్దా (బరవడ్డ)లో జరిగే బహిరంగ ర్యాలీలో కూడా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలోని ఆరాంబాగ్‌లో 7,200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, అంకితం మరియు శంకుస్థాపన చేసే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. రేపు, మోడీ పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని కృష్ణానగర్‌కు చేరుకుంటారు, అక్కడ 15 వేల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం బీహార్‌లోని ఔరంగాబాద్‌లో 21,400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..