బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు సున్నా సీట్లు! ప్రధాని మోదీ సెటైర్ వైరల్

బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంల వినియోగంపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు సున్నా సీట్లు! ప్రధాని మోదీ సెటైర్ వైరల్
Pm Modi's Dig With Emoji

Updated on: Oct 28, 2026 | 8:16 PM

న్యూఢిల్లీ: బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంల వినియోగంపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

మోదీ పోస్టులో ఏముందంటే?

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లోని 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయని ప్రధాని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించారని గుర్తుచేస్తూ, కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుచుకుందో ఊహించాలంటూ ప్రశ్నించారు. పోస్టుకు ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని కూడా జతచేశారు.

ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ రాజకీయ వైఖరిపై ఆయన విమర్శలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలివే!

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ–జేడీ(ఎస్‌) కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్‌కు ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు పలు స్థానాలను గెలుచుకున్నాయి. బీహార్‌లో ఆర్జేడీ, బీజేపీ, జన సూరాజ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు విజయాలు సాధించారు. దర్భంగా టీచర్స్ నియోజకవర్గంలో జన సూరాజ్ పార్టీ విజయం సాధించడం ఆ పార్టీకి కీలక పరిణామంగా నిలిచింది. మహారాష్ట్రలోని కొన్ని స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మళ్లీ తెరపైకి బ్యాలెట్‌ వర్సెస్‌ ఈవీఎం చర్చ

ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు గత కొంతకాలంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఓట్ల చోరీ, ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండగా, బీజేపీ వాటిని ఖండిస్తోంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించలేకపోయిందంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా, నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓటును కాపాడండి–దేశాన్ని కాపాడండి’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో రాజకీయ చర్చను మరింత వేడెక్కిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us