
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. భారతదేశం ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తుందని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా X లో పోస్ట్ చేస్తూ, “UAE అధ్యక్షుడు, నా సోదరులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో మాట్లాడాను. UAE పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించాను. ఈ దాడులలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాను. ఈ క్లిష్ట సమయంలో UAE కి భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది. UAEలో నివసిస్తున్న భారతీయ సమాజం పట్ల వారు చూపిన శ్రద్ధకు నా కృతజ్ఞతలు తెలియజేసాను. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ శాంతి, భద్రత , స్థిరత్వానికి మేము మద్దతు ఇస్తున్నాము” అని రాశారు.
Spoke with President of the UAE, my brother Sheikh Mohamed bin Zayed Al Nahyan. Strongly condemned the attacks on the UAE and condoled the loss of lives in these attacks. India stands in solidarity with the UAE in these difficult times.
Thanked him for taking care of the Indian…
— Narendra Modi (@narendramodi) March 1, 2026
అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS)తో సమావేశమయ్యారు. ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత తలెత్తిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై చర్చించారు. దేశ భద్రత, వ్యూహాత్మక విషయాలపై CCS అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..