PM Modi: ‘ప్రపంచ వేదికపై భారత్‌ గొంతుక’ ముగిసిన జీ7 సమ్మిట్.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..

|

Jun 15, 2024 | 11:16 AM

ఇటలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ముగిసింది. జీ7 దేశాల సదస్సులో భాగంగా ఇటలీకి వెళ్లిన మోదీ.. అనంతరం భారత్ కు పయనమయ్యారు. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతంలో జీ7 దేశాల సదస్సు జరిగింది. జీ7 దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. పలు దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.. అంతేకాకుండా.. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం.. ప్రపంచ అనిశ్చితులు, గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనల గురించి ప్రపంచ వేదికపై మాట్లాడారు..

PM Modi: ‘ప్రపంచ వేదికపై భారత్‌ గొంతుక’ ముగిసిన జీ7 సమ్మిట్.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..
Pm Modi
Follow us on

ఇటలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ముగిసింది. జీ7 దేశాల సదస్సులో భాగంగా ఇటలీకి వెళ్లిన మోదీ.. అనంతరం భారత్ కు పయనమయ్యారు. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతంలో జీ7 దేశాల సదస్సు జరిగింది. జీ7 దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. పలు దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.. అంతేకాకుండా.. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం.. ప్రపంచ అనిశ్చితులు, గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనల గురించి ప్రపంచ వేదికపై మాట్లాడారు.. ముఖ్యంగా.. జీ7 సదస్సులో ఏఐపై ప్రత్యేకంగా మాట్లాడిన మోదీ.. టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి స్వస్తి పలకాలంటూ సూచించారు. సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకోవాలని సూచించిన మోదీ.. అనేక విషయాల్లో అవగాహాన అవసరమంటూ నొక్కిచెప్పారు. G-7 సమావేశంలో భాగంగా క్రైస్తవ మతాధిపతి పోప్‌ ఫ్రాన్సిస్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలుసుకున్నారు. పోప్‌ను మోదీ ఆలింగనం చేసుకోవడం హైలైట్‌ అయింది. పర్యటన ముగిసన తర్వాత ప్రధాని మోదీ ఎక్స్ లో కీలక ట్వీట్ చేశారు. G7 సమ్మిట్ లో.. నేను ప్రపంచ వేదికపై భారతదేశ దృక్పథాన్ని పంచుకున్నానంటూ తెలిపారు.

వీడియో చూడండి..

జీ7 సదస్సులో ప్రధాని మోదీ.. బిజీబిజీగా గడిపారు. పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో సమావేశమైన భారత ప్రధాని.. భారత్-ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇక బ్రిటన్‌తో సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వంటి అంశాలను ఆ దేశ ప్రధాని రుషి సునాక్‌తో చర్చించినట్టు తెలిపారు ప్రధాని మోదీ. సెమీకండక్టర్లు, టెక్నాలజీ, వాణిజ్యం తదితర రంగాల్లో పటిష్ఠ సంబంధాలకు గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ సమావేశామయ్యారు. ఇరువురు నేతలు అనేక అంశాలపై చర్చించుకున్నారు. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో శాంతి స్థాపనకు చర్చలు, దౌత్య విధానాలే మార్గమని నమ్ముతున్నామని జెలెన్ స్కీకి తెలియజేసినట్టు మోదీ వెల్లడించారు.

ముందుగా G7శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ – ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ అయ్యారు. గతేడాది మెలోని భారత పర్యటన సందర్భంగా చర్చించిన అంశాల కొనసాగింపుగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, టెలికాం, మరిన్ని రంగాలలో భారతదేశం-ఇటలీ సంబంధాలను మరింత పటిష్టం చేసే మార్గాల గురించి చర్చించినట్లు మోదీ తెలిపారు.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో కూడా ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో భేటీ అయ్యారు. భారతదేశం అమెరికా ప్రపంచ ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తాయంటూ మోదీ తెలిపారు. G7 సమ్మిట్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో కూడా మోదీ భేటీ అయ్యారు.

ఇటలీలో G7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జపాన్ ప్రధానమంత్రి కిషిదాతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారతదేశం, జపాన్ మధ్య బలమైన సంబంధాలు శాంతియుత, సురక్షితమైన, సంపన్న ఇండో-పసిఫిక్ కోసం ముఖ్యమైనవి. రక్షణ, సాంకేతికత, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీలో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాయి. అంటూ మోదీ పేర్కొన్నారు.

కాగా.. G7 శిఖరాగ్ర సదస్సులో భారత్‌ పాల్గొనడం ఇది పదకొండోసారి. వరుసగా ఐదేళ్ల నుంచి ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..