PM Modi: నేడు వయనాడ్‌కు ప్రధాని మోడీ.. బాధితులకు పరామర్శ

|

Aug 10, 2024 | 8:38 AM

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విలయానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రం గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 400 మందికిపైగా మృతి చెందగా.. మరో 200 మంది ఆచూకీ గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన నరేంద్ర మోడీ శనివారం..

PM Modi: నేడు వయనాడ్‌కు ప్రధాని మోడీ.. బాధితులకు పరామర్శ
Pm Modi
Follow us on

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విలయానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రం గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 413 మందికిపైగా మృతి చెందగా.. మరో 200 మంది ఆచూకీ గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన నరేంద్ర మోడీ శనివారం వయనాడ్‌లో పర్యటించనున్నారు. సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు మోడీ పర్యటించనున్నారు శనివారం ఉదయం 11 గంటలకు మోడీ కన్నూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు.

అలాగే మధ్యాహ్నం 12:15 గంటలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మోడీ సందర్శిస్తారు. అక్కడ ప్రధానికి రెస్క్యూ ఫోర్స్ చేపట్టిన సహాయక చర్యల గురించి తెలుసుకుంటారు. అలాగే జరుగుతున్న పునరావాస పనులను ప్రధాని పరిశీలిస్తారు. అనంతరం బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయ శిబిరాలు, ఆసుపత్రిని కూడా సందర్శిస్తారు. అక్కడ కొండచరియలు విరిగిపడిన బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని పరామర్శిస్తారు.

అధికారులతో సమావేశం

వయనాడ్‌ ప్రకృతి బీభత్సంపై జరిగిన నష్టం, సహాయక చర్యల గురించి ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలు, ప్రస్తుత పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

ఇదిలా ఉండగా, కేంద్ర అధికారుల బృందం నేతృత్వంలో రక్షణ ఏజెన్సీలకు చెందిన వెయ్యిమందికిపైగా సభ్యులు గురువారం తెల్లవారుజాము నుంచే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నది నుండి మృతదేహాలను, శరీరభాగాలను వెలికితీసి ముందుగా వాటిని డీఎన్‌ఏ పరీక్షకు పంపి, అనంతరం వాటిని గుర్తిస్తారు. అనంతరం మృతదేహాలను ఖననం చేస్తున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో వందకుపైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా, 10వేలమందికిపైగా బాధితులు వీటిలో ఆశ్రయం పొందుతున్నారు. వీరికి అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది.

 


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి