రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సంతాపం వ్యక్తం చేసింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సర్కార్యవా దత్తాత్రేయ హోసబాలే ఆయనకు నివాళులర్పించారు. ముక్తాత్మ స్వామీజీ స్ఫూర్తిదాయకమైన స్మృతికి సవినయంగా నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. రామకృష్ణ మఠం గొప్ప పని దాని సంకల్పం, స్ఫూర్తితో కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు.
‘రామకృష్ణ మఠం మిషన్ అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ బ్రహ్మలోకాన్ని పొందారనే వార్త విన్న తర్వాత అసంఖ్యాకమైన రామకృష్ణ మఠం భక్తులు, శ్రీరామకృష్ణ మరియు స్వామి వివేకానంద అసంఖ్యాకమైన అనుచరులు దిగ్బాంతికి లోనయ్యారు. శ్రీమత్ సంఘగురు, సేవ మరియు ఆధ్యాత్మికతకు తన ఆదర్శప్రాయమైన అంకితభావంతో, రామకృష్ణ మిషన్ మఠానికి స్ఫూర్తిదాయకమైన సంప్రదాయంలో అద్భుతమైన నాయకత్వం అందించారని మోహన్ భగవత్ కొనియాడారు. ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుచరులందరి శోకాన్ని పంచుకుంటుంది. ముక్తాత్మ స్వామీజీ స్ఫూర్తిదాయక స్మృతికి వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది. రామకృష్ణ మఠం గొప్ప కార్యం దాని సంకల్పంతో మరింత అభివృద్ధి చెందాలని మోహన్ భగవత్ అకాంక్షించారు.
శ్రీమత్ స్వామి స్మరణానందుని వయస్సు 95 సంవత్సరాలు. 2017లో రామకృష్ణ మిషన్‌కు 16వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇన్ఫెక్షన్ కారణంగా జనవరి 29న రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్‌లో చేరారు. తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. ఆ తర్వాత మార్చి 3న వెంటిలేటర్‌పై ఉంచారు. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఆయన మార్చి 26 రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి రామకృష్ణ మఠం శోకసంద్రంలో మునిగిపోయింది.
ప్రధాని మోదీ సంతాపం
శ్రీమత్ స్వామి స్మరణానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన లెక్కలేనన్ని హృదయాలు, మనస్సులపై చెరగని ముద్ర వేశారు’ అని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ‘X’ ద్వారా పోస్ట్‌లో ప్రధాని పేర్కొన్నారు. అతని కరుణ, జ్ఞానం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. కొన్నేళ్లుగా ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, 2020లో బేలూర్ మఠాన్ని సందర్శించినప్పుడు అతనితో సంభాషించినట్లు ప్రధాని పేర్కొన్నారు. కొన్ని వారాల క్రితం, కోల్‌కతాలోని ఆసుపత్రికి కూడా వెళ్లిన ప్రధాని అతని ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
Srimat Swami Smaranananda ji Maharaj, the revered President of Ramakrishna Math and Ramakrishna Mission dedicated his life to spirituality and service. He left an indelible mark on countless hearts and minds. His compassion and wisdom will continue to inspire generations.
I had… pic.twitter.com/lK1mYKbKQt
— Narendra Modi (@narendramodi) March 26, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…