గంగానది ప్రక్షాళనపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ‘ నమామి గంగే ‘ పేరిట చేపట్టిన ప్రాజెక్టు పురోగతిమీద శనివారం కాన్పూర్ లో జరిగిన సమావేశంలో ఆయన సమీక్షించారు. ‘ నేషనల్ కౌన్సిల్ ఫర్ గంగ ‘ నిర్వహించిన తొలి సమావేశమిది.. ఈ మీటింగ్ లో యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, త్రివేంద్ర సింగ్ రావత్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ, ఇంకా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకున్న మోదీ.. సంబంధిత రాష్ట్రాల సీఎం లకు, అధికారులకు తగిన సూచనలు, సలహాలిచ్చారు. ఈ సమావేశానికి ముందు గంగానది ప్రక్షాళనపై ‘ నమామి గంగ మిషన్ ‘ నిర్వహించిన ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టు కింద చేబట్టిన పనులను చూసేందుకు ఆయన గంగా బ్యారేజీ సమీపంలో కొత్తగా నిర్మించిన ‘ అటల్ ఘాట్ ‘ ను విజిట్ చేస్తారని, అతి పెద్ద డ్రైన్ వద్ద ఈ మధ్యే ఏర్పాటు చేసిన ‘ సెల్ఫీ పాయింట్ ‘ లో ‘ సెల్ఫీ ‘ దిగుతారని తెలుస్తోంది. అటు మోదీ శనివారం మధ్యాహ్నం గంగానదిలో కొద్దిసేపు బోటులో ప్రయాణించారు. ఆయన వెంట యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు.. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీతో సహా ఈ రెండు రాష్ట్రాల అధికారులు ఉన్నారు. గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా- శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి.. పనుల పురోగతిపై అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు.
Kanpur: PM Modi takes a boat ride in river Ganga at Atal ghat, along with CM Yogi Adityanath, Bihar Dy CM Sushil Modi & Uttarakhand CM TS Rawat. He chaired the first meeting of National Rejuvenation, Protection and Management of River Ganga Council (National Ganga Council) today. pic.twitter.com/r0mk26QGAL
— ANI UP (@ANINewsUP) December 14, 2019