అతి పెద్ద సోలార్ విద్యుత్తు ప్లాంటును జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విద్యుత్ ప్లాంటును మధ్యప్రదేశ్‌లోని రేవాలో నిర్మించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 750 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న మొదటి 5 దేశాల్లో భారత్ ఒకటి అన్నారు. సోలార్ విద్యుత్తు ఇప్పటికే కాదు, 21వ శతాబ్దపు అవసరాలను తీర్చేది. ఎందుకంటే సోలార్ విద్యుత్తు ఖచ్చితమైనది, స్వచ్ఛమైనది, భద్రమైనదని పేర్కొన్నారు.
కాగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 26,506 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 475 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,802కి చేరుకుంది. ఇందులో 2,76,685 యాక్టివ్ కేసులు ఉండగా.. 21,604 మంది కరోనాతో మరణించారు. అటు 4,95,513 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Delhi: Prime Minister Narendra Modi dedicates to the nation the 750 MW Solar Project set up at Rewa, Madhya Pradesh, via video conferencing. pic.twitter.com/O7MCLH6Efb
— ANI (@ANI) July 10, 2020
Read More:
డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త..
Gold rate@51K. రాబోతున్న శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో ఇంకా పెరుగుతుందా!
గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిలకు వల.. బన్నీ పక్కన హీరోయిన్ అంటూ..