PM Modi: వారణాసిలో నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం.. అంబులెన్స్ కోసం కాన్వాయ్ ఆపిన ప్రధాని.. వీడియో..

PM Narendra Modi Varanasi Visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం వారణాసి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి కాశిలో అపూర్వ స్వాగతం లభించింది. సాధువులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు..

PM Modi: వారణాసిలో నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం.. అంబులెన్స్ కోసం కాన్వాయ్ ఆపిన ప్రధాని.. వీడియో..
Pm Modi

Updated on: Dec 17, 2023 | 5:59 PM

PM Narendra Modi Varanasi Visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం వారణాసి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి కాశిలో అపూర్వ స్వాగతం లభించింది. సాధువులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.. కాన్వాయ్ పై పూల వర్షం కురిపించి.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. కాగా.. ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో రోడ్ షో సందర్భంగా అంబులెన్స్‌కు మార్గం కల్పించడానికి తన కాన్వాయ్‌ను ఆపారు. ఈ పర్యటనలో, వారణాసి.. పూర్వాంచల్ కోసం 19,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 37 ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభింస్తారు.

అంతేకాకుండా, నమో ఘాట్ నుంచి కాశీ తమిళ సంగమం 2.0ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో పాటు కన్యాకుమారి నుంచి వారణాసి వరకు కొత్త రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు.

వీడియో చూడండి..

ప్రధాని మోదీ తన రోడ్ షోలో అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు కూడా ఆయన కాన్వాయ్‌ని ఆపి అంబులెన్స్‌కి వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేశారు.


వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పాఠశాలల పిల్లల సైన్స్ ప్రాజెక్టులను కూడా సందర్శించి.. వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఇన్ స్టాలో ఓ రీల్ ను విడుదల చేశారు.

కాగా.. ఈ రోజు నుండి డిసెంబర్ 31 వరకు కాశీ తమిళ సంగమం రెండవ ఎడిషన్ సందర్భంగా తమిళనాడు – పుదుచ్చేరి నుండి సుమారు 1,400 మంది వారణాసితో పాటు ప్రయాగ్‌రాజ్, అయోధ్యకు వెళతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..