న్యూజిలాండ్ ప్రధానికి మోదీ అభినందనలు

| Edited By: Anil kumar poka

Oct 18, 2020 | 4:39 PM

న్యూజిలాండ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆ దేశ ప్రధాని జసిండా  ఆర్డెర్న్ ని ప్రధాని మోదీ అభినందించారు. భారత-న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు.

న్యూజిలాండ్ ప్రధానికి మోదీ అభినందనలు
Follow us on

న్యూజిలాండ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆ దేశ ప్రధాని జసిండా  ఆర్డెర్న్ ని ప్రధాని మోదీ అభినందించారు. భారత-న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశిస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. సుమారు ఏడాది క్రితం ఆమెతో తాను భేటీ అయ్యానని ఆయన గుర్తు చేశారు. న్యూజిలాండ్ ఎన్నికల్లో 87 శాతం ఓట్ల లెక్కింపు కాగా-జసిండా  నేతృత్వంలోని సెంటర్-లెఫ్ట్ లేబర్ పార్టీ దాదాపు 49 శాతం ఓట్లను పొందింది. 1996 నుంచి ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఇంత అత్యధిక శాతం ఓట్లను చేజిక్కించుకోలేదని సీఎన్ఎన్ పేర్కొంది.