
విదేశీ వస్తువులు మన జీవితాల్లోకి ఎంతలా చొచ్చుకొస్తున్నాయనే అంశంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వినాయక విగ్రహాలు, హోళీ రంగులు, ఆఖరికి పిన్నులు కూడా విదేశాల నుంచే వస్తున్నాయంటూ మోదీ పేర్కొన్నారు. గుజరాత్ పర్యటన సందర్భంగా ఓ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. “ఎంత లాభం వస్తున్నా విదేశీ వస్తువులను అమ్మబోమని వ్యాపారులతో ప్రతిజ్ఞ చేయించాలి. కానీ దురదృష్టవశాత్తు, గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుండి వస్తున్నాయి. కళ్ళు కూడా సరిగ్గా తెరవని చిన్న కళ్ల గణేష్ విగ్రహాలు. హోలీ సందర్భంగా మన చల్లుకునే రంగులు కూడా విదేశీ ఉత్పత్తులే వస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ కోసం.. ఒక పౌరుడిగా నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇంటికి వెళ్లి ఉదయం నుండి మరుసటి ఉదయం వరకు 24 గంటల్లో మీరు ఎన్ని విదేశీ ఉత్పత్తులను ఉపయోగిస్తారో లెక్కించండి. అప్పుడు తెలుస్తుంది.. విదేశీ వస్తువులు మన జీవితాల్లోకి ఎంత వచ్చేశాయో. కొన్నిసార్లు మీరు తెలియకుండానే దువ్వెనలు లేదా హెయిర్‌పిన్‌లు, టూత్ పిక్ వంటి విదేశీ వస్తువులను ఉపయోగిస్తారు..” అని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనికుల పని మాత్రమే కాదని, అది 140 కోట్ల మంది ప్రజలది కూడా అని తెలిపారు.
Gandhinagar, Gujarat: Prime Minister Narendra Modi says, “We must encourage village traders to pledge that no matter how much profit they make, they will not sell foreign goods. But unfortunately, even Ganesh idols come from abroad, small-eyed Ganesh idols whose eyes don’t even… pic.twitter.com/7Byd8iaI3j
— IANS (@ians_india) May 27, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి