రైతులకు ముఖ్య సూచన. మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 31లోగా e-KYC వివరాలను నమోదు ప్రధానమంత్రి కిసాన్ యోజన (PM Kisan Scheme)కింద 10వ విడత రైతుల ఖాతాలో జనవరి 1, 2022న విడుదల చేయబడింది. అయితే.. ఇప్పుడు 11వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏటా రూ.6000 జమచేస్తుంది. రైతులకు నాలుగు నెలలకే అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా అందజేస్తారు. పీఎం కిసాన్ యోజన కింద 11వ విడత ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయవచ్చు. ఈలోగా మార్చి 31 వరకు రైతులకు అవసరమైన పనులు చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఈ పనిని పూర్తి చేయకపోతే, మీరు ఇప్పుడే పూర్తి చేయాల్సి ఉంది. అనర్హులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం e-KYCని తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ యోజన పోర్టల్‌లో రైతులకు ఇ-కెవైసి అవసరమని.. త్వరగా పూర్తి చేయాలని కూడా సమాచారం అందించబడింది. అయితే, e-KYC కోసం గడువు ఇక్కడ నుంచి ముగింపు దశకు చేరుకుంది. KYC లేకుంటే మీకు 11వ విడత పీఎం కిషన్ యోజన పథకం నుంచి వచ్చే డబ్బులు నిలిచిపోతాయి.
అయితే ఇప్పటి వరకు కూడా మీరు e-KYC పూర్తి చేయకుండా ఉంటే వెంటనే ఈ పని పూర్తి చేయండి. ఇలా చేయడం వల్ల మీకు 11 వ విడత పీఎం కిషన్ యోజన డబ్బులు వచ్చే నెలలో మీ ఖాతాలో జమ కానున్నాయి. అయితే మీరు నమోదు చేయడం మరిచిపోతే వెంటే ఇలా చేయండి..
e-KYC చేసే విధానాన్ని తెలుసుకోండి
డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయంటే..
అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రతి ఏటా రూ.6 వేలు అందిస్తారు. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఏడాదిలో మొత్తంగా మూడు సార్లు ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో తొలి విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి జూలై 31లోపు రైతులకు చేరతాయి. ఎప్పుడైనా ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చు. రెండో ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30లోపు రైతుల బ్యాంక్ ఖాతాలలోకి చేరతాయి. అదేమసయంలో మూడో ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు డిసెంబర్ 1 నుంచి మార్చి 31లోపు ఎప్పుడైనా రావొచ్చు. ఇలా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తంగా రూ. 6 వేలు అన్నదాతల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతున్నాయి.
స్కీమ్ ప్రత్యేకతలు
ఇవి కూడా చదవండి: Gangster Naeem: గ్యాంగ్స్టర్ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్..
ఈ ఫోటోలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో గుర్తుపట్టండి చూద్దాం.. మీరు మొదట చూసేదే మీ వ్యక్తిత్వం..