
పహల్గామ్ దాడి వెనక పాక్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. దాడిపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించిన తీరు కూడా పహల్గామ్ అటాక్ వెనక దాయాది దేశం ఉందని తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం ఇప్పటికే పాక్ పై తీవ్ర ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందం రద్దు, వీసా సేవలతో పాటు దౌత్య సంబంధాలను నిలిపివేస్తున్నామంటూ భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతోన్న పాక్ కు భారత ప్రభుత్వ ఆంక్షలు, నిబంధనలతో పాక్ కు మరిన్ని సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. మరోవైపు భారత్ -పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే ఒక వేళ యుద్ధమే జరిగితే పాక్ కు భారీగా నష్టం తప్పదంటున్నారు నిపుణులు. దీనిపై పాక్ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ బాధను సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కుతున్నారు. పాక్ ప్రజలు పోస్ట్ లు, మీమ్స్ తో తమ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం పాకిస్తాన్ వ్యవసాయం, జలవిద్యుత్ పై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడనుంది. భారత ప్రభుత్వం నిర్ణయంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సింధు పరీవాహక ప్రాంతం నుంచి నీటి సరఫరా ఆగిపోతనుంది. సింధు నదిపై ఆధారపడే పాక్ లో 80 శాతం వ్యవసాయం జరగనుంది. అలాగే జలవిద్యుత్‌లో మూడవ వంతు సింధు నది నీటి నుంచే ఉత్పత్తి అవుతుంది.
ఇక సింధు జలాల ఒప్పందం అమల్లోకి వస్తే పాకిస్తాన్‌లో, ముఖ్యంగా పంజాబ్, సింధ్‌లలో తీవ్రమైన నీటి సంక్షోభానికి దారితీస్తుందంటున్నారు. ఇది నీటిపారుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, భూగర్భజల క్షీణత, లవణీయత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రజలు తమ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, పోస్టు లు షేర్ చేస్తూ పాక్ సర్కారును ఎండగడుతున్నారు.
These Pak people are roasting themselves on a different level 😭 pic.twitter.com/ckAA4F2So1
— Phunsuk Wangdu (@Phunsukwangduji) April 25, 2025
please bhaizaan 😭🙏 pic.twitter.com/hbLUnLbtob
— Faizan (@faizannriaz) April 24, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..