PM Narendra Modi: ఇటీవల ప్రధాని మోడీ వారణాసిని పర్యటించారు. కాశీనాథ్ కారిడార్ ను ప్రారంభోత్సవ సమయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన అందరి హృదయాలను హత్తుకుంది. ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ తనను ప్రత్యక్షంగా కలిసేందుకు వచ్చిన ఓ దివ్యాంగ మహిళ పాదాలను తాకి కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 13న వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించిన కొద్దిసేపటికే శిఖా రస్తోగి అనే వికలాంగ మహిళ వచ్చారు. ఆ మహిళను చూసిన ప్రధానిమోడీ క్షేమసమాచారాలను అడిగితెలుసుకున్నారు. శిఖా రాస్తోగి ప్రధానమంత్రి ఆశీస్సులు తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు.. శిఖా రాస్తోగి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరుగా ఖ్యాతిగాంచిన భారత ప్రధాని మోడీ ఒక వికలాంగ మహిళ పాదాలను తాకిన దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. శిఖా ముకుళిత హస్తాలతో నిలబడి, ప్రధానికి గౌరవాన్ని ఇస్తూ.. తన కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ .. శిఖా రాస్తోగిను అభినందించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భద్రతా సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రధానమంత్రి మోడీ మహిళ పాదాలను తాకిన ఫోటో క్షణంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోను బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది మహిళా శక్తికి గౌరవం” అని పేర్కొన్నారు.
ఇదే విషయంపై శిఖా సోదరుడు విశాల్ మాట్లాడుతూ.. శిఖా పుట్టినప్పటి నుంచి భిన్న వ్యక్తిత్వం గలదని చెప్పారు. తన సోదరిని చూసి గర్వపడుతున్నానని అన్నారు. అంతేకాదు ఎవరి ఇంట్లో దివ్యాంగులు ఉన్నా.. వారిని బలహీనులుగా పరిగణించవద్దని విజ్ఞప్తి చేశారు.
यह सम्मान समस्त नारी शक्ति का सम्मान है । गर्व है हम सभी को अपने प्रधानमंत्री श्री @narendramodi जी पर । pic.twitter.com/L989Wp8Ukl
— Vanathi Srinivasan (@VanathiBJP) December 15, 2021
Also Read: చేపట్టిన పని విజయవంతంకావాలంటే.. సఫల ఏకాదశి వ్రతమాచరించండి.. పూజా విధానం మీ కోసం..