కోవిడ్ పై పోరులో రానున్న 100 రోజులనుంచి 125 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని…కేంద్రం హెచ్చరించింది. రెండు నెలల క్రితం విజృంభించిన సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందని, అందువల్ల దీన్ని మనం సంకేతంగా తీసుకోవాలని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డా.వీ.కె.పాల్ తెలిపారు. ఒక విధంగా ఇది మనకు హెచ్చరిక అని పేర్కొన్నారు. పలు రాష్ట్రాలు ఆంక్షలను చాలావరకు సడలించాయని, సెందో వేవ్ తగ్గిందనుకున్నా..మూడో వేవ్ రాదన్న గ్యారంటీ ఏదీ లేదన్నారు. దీన్ని నివారించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్టు ఆయన చెప్పారు. జులై ముగిసేలోగా 50 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు పాల్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచడం ఒక్కటే మార్గమని, ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. రెండు డోసులూ పూర్తిగా తీసుకున్న పోలీసులు కోవిడ్ రిస్క్ నుంచి బయటపడినట్టు తేలిందన్నారు.
ఐసీఎంఆర్ తమిళనాడులో నిర్వహించిన స్టడీలో ఈ విషయం వెల్లడైందన్నారు. ఈ విధమైన అధ్యయనాలు ఇతర రాష్ట్రాల్లో కూడా చేపట్టవలసి ఉందని పాల్ అభిప్రాయపడ్డారు. కాగా గత 24 గంటల్లో దేశంలో 38,989 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇలా ఉండగా థర్డ్ వేవ్ లో ఆగస్టు నెలలో రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్ నిపుణుడు డా. సమిరన్ పాండే వెల్లడించారు. అప్పుడు పరిస్థితి తొలి వేవ్ మాదిరి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ వైరస్ మరింతగా రొటేట్ అయ్యే ప్రమాదం ఉందని.. ఈ కారణంగా కేసులు పెరగవచ్చునని ఆయన చెప్పారు. అందువల్లే ఇప్పటి నుంచే మనం అప్రమత్తంగా ఉండాలని ఆయన కూడా సూచించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghan Crisis: భారత ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మృతదేహాన్ని రెడ్ క్రాస్ కి అప్పగించిన తాలిబన్లు…
Luxury Car Smuggling Racket: లగ్జరీ కార్లపై సుంకం ఎగవేత వ్యవహారం గుట్టురట్టు.. ఆరు కార్లు స్వాధీనం