లారీ బోల్తాపడితే లూటీ చేసిన జనాలు..!

|

Nov 13, 2019 | 5:35 PM

ఎప్పుడూ రద్దీగా ఉండే నడిరోడ్డుపై ఉన్నట్టుండి చేపల వర్షం కురిస్తే..ఎలా ఉంటుంది. అది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..చేపల వేటకు జనాలు ఎగబడటం ఖాయం. అచ్చం ఇదే సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఒక్కసారిగా రోడ్డుపై పడిన చేపలను చేజింకించుకునేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే, అక్కడ చేపల వర్షం కాదు కురిసింది..కానీ బతికి ఉన్న  చేపలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. దీంతో రహదారిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. చేపల లోడుతో కాన్పూర్‌ వెళ్తున్న ఒక ట్రక్కు ప్రమాదవశాత్తూ తిరగబడింది. […]

లారీ బోల్తాపడితే లూటీ చేసిన జనాలు..!
Follow us on
ఎప్పుడూ రద్దీగా ఉండే నడిరోడ్డుపై ఉన్నట్టుండి చేపల వర్షం కురిస్తే..ఎలా ఉంటుంది. అది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..చేపల వేటకు జనాలు ఎగబడటం ఖాయం. అచ్చం ఇదే సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఒక్కసారిగా రోడ్డుపై పడిన చేపలను చేజింకించుకునేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే, అక్కడ చేపల వర్షం కాదు కురిసింది..కానీ బతికి ఉన్న  చేపలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. దీంతో రహదారిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. చేపల లోడుతో కాన్పూర్‌ వెళ్తున్న ఒక ట్రక్కు ప్రమాదవశాత్తూ తిరగబడింది.  అందులోని చేపలన్నీ రోడ్డు మీద పడ్డాయి. కాన్పూర్‌లో అత్యంత రద్దీగా ఉండే కల్పీ రోడ్డు వద్ద జరిగిన ఈ సంఘటనకు రోడ్డు మీద వెళ్తున్న వారు మొదట విస్తుపోయారు. అంతలోనే తేరుకుని రోడ్డు మీద గిలగిలలాడుతున్న చేపలను అందిన కాడికి తమ బ్యాగుల్లోనూ, సంచుల్లోనూ ఇంకా జేబుల్లోనూ నింపుకుని ఆనందంగా ఇళ్లకు తీసుకెళ్లారు.