అరుదైన దృశ్యాలు.. భారతీయుల చేతుల్లో అమెరికా జెండాలు

| Edited By:

Feb 24, 2020 | 11:50 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ఇండియాలో వింత దృశ్యం కనిపించింది. ప్రధాని మోదీతో పర్యటన నేపథ్యంలో భారతీయులు అమెరికా, ఇండియా జెండాలు పట్టుకుని స్వాగతం..

అరుదైన దృశ్యాలు.. భారతీయుల చేతుల్లో అమెరికా జెండాలు
Follow us on

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ఇండియాలో వింత దృశ్యం కనిపించింది. ప్రధాని మోదీతో పర్యటన నేపథ్యంలో భారతీయులు అమెరికా, ఇండియా జెండాలు పట్టుకుని స్వాగతం పలుకుతున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి.. మోతేరా క్రికెట్ స్టేడియం 22 కిలోమీటర్ల మేర.. ట్రంప్, ప్రధాని మోదీ రోడ్‌ షో ఉంది. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు అహ్మదాబాద్ రోడ్లపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. అలాగే దాదాపు 35 నిమిషాల పాటు ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో అడుగడుగునా స్వాగతం పలికేలా హోర్డింగులు, ప్లకార్డులు, స్టేజీలపై నృత్యాలను అరెంజ్ చేశారు అధికారులు.

మధ్యాహ్నం 12.30కి స్టేడియం ప్రారంభం తర్వాత నమస్తే ట్రంప్ కార్యక్రమం మొదలవుతుంది. అక్కడ అమెరికా అధ్యక్షుడు ప్రజలనుద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది.అక్కడి నుంచి 3.30కి మిస్టర్ అండ్ మిసెస్ ట్రంప్ ఆగ్రాకు బయల్దేరతారు. సాయంత్రం 4.45కు ఆగ్రాకు చేరుకుని తాజ్‌మహల్‌ని సందర్శిస్తారు. తిరిగి అక్కడి నుంచి ఇద్దరూ 6.45కి బయల్దేరుతారు. రాత్రి 7.30కి ఢిల్లీ పాలం ఎయిర్ పోర్టుకు చేరుకొని.. రాత్రి 8 గంటలకు ఢిల్లీలోని హోటల్ ఐటీసీ మౌర్యలో బస చేస్తారు.