Traffic Rules: వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. పిల్లలతో ప్రయాణించేప్పుడు ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘిస్తే అంతే సంగతులు..

రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలు,రోడ్డు భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్‌ రూల్స్‌లో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇకపై 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులకు సాధారణం కంటె రెట్టింపు జరిమానా విధించనున్నారు. ఈ కొత్త రూల్స్‌ ఆదివారం(జులై 20) నుంచి అమల్లోకి వచ్చాయి.

Traffic Rules: వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. పిల్లలతో ప్రయాణించేప్పుడు ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘిస్తే అంతే సంగతులు..
New Rules

Updated on: Jul 21, 2025 | 8:58 AM

18 ఏళ్ల లోపు పిల్లలతో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్లే సాధారణం కంటె రెట్టింపు జరిమానా విధించబడుతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనను తీసుకొచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనితో పాటు డ్రైవర్లకు మెరిట్, డీమెరిట్‌ పాయింట్స్‌ సిస్టమ్స్‌ను కూడా తీసుకురానుంది. ఇది మనం ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఉల్లంఘించడంపై ఆదారపడి ఉంటుంది. మెరిట్ అండ్ డీమెరిట్ సిస్టమ్’లో, డ్రైవర్‌కు థ్రెషోల్డ్ డెమెరిట్ పాయింట్లను కనుక వచ్చినట్లైయితే వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనల నేపథ్యంలో వాహనదారులకు అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, వారు వాహనంలో ఉన్నప్పుడు డ్రైవర్లు మరింత జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ కొత్త నిబంధన ప్రకారం. పిల్లలు వాహనంలో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవడం, స్పీడ్ లిమిట్‌ మించి వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్‌ చేయడం వంటి ఉల్లంఘనలు చేస్తే ఆ వాహనదారుడికి సాధారణ జరిమానాతో పాటు అదనంగా రెట్టింపు జరిమానా విధించబడుతుందని కేంద్రమంత్రిత్వ శాఖ పేర్కొంది

పిల్లలు ఉన్నప్పుడు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే..

ట్రాఫిక్ ఉల్లంఘనకు సాధారణంగా రూ.1000 జరిమానా విధిస్తే.. పిల్లలు వాహనంలో ఉన్నప్పుడు రూ.2000 జరిమానా విధించబడుతుంది. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, పిల్లల భద్రత దృష్టిలో ఉంచుకొని, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, స్కూల్ బస్సులు పిల్లలతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిబంధనలను పాటించకపోవడం పెరుగుతున్నందున జరిమానాను రెట్టింపు చేయాలనే ప్రతిపాదనను కేంద్రం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.