Tejashwi Yadav: బీహార్‌ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీపై కేసు నమోదు.. అతని సోదరిపై కూడా.. ఎందుకంటే..?

FIR against Tejashwi Yadav: బీహార్ ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (ఆర్జేడీ) నేత తేజ‌శ్వీ యాద‌వ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలని పాట్నా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తేజస్వీతోపాటు

Tejashwi Yadav: బీహార్‌ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీపై కేసు నమోదు.. అతని సోదరిపై కూడా.. ఎందుకంటే..?
Tejashwi Yadav

Updated on: Sep 21, 2021 | 12:46 PM

FIR against Tejashwi Yadav: బీహార్ ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (ఆర్జేడీ) నేత తేజ‌శ్వీ యాద‌వ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలని పాట్నా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తేజస్వీతోపాటు ఆయన సోదరి మిసా భారతిపై కూడా కేసు నమోదు చేయాలని కోర్టు ఉత్తర్వుల్లో తెలిపింది. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఆర్‌జేడీ తరుపున లోక్‌స‌భ టికెట్ ఇస్తాన‌ని చెప్పి రూ. 5 కోట్లు తీసుకున్నారని.. చివరకు టికెట్ ఇవ్వకుండా తేజ‌స్వీ యాద‌వ్ త‌న‌ను మోసం చేశారని సంజీవ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు సంజీవ్‌ కుమార్‌ సింగ్‌ పాట్నా కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. తేజ‌స్వీపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

తేజ‌స్వీ పేరుతో పాటు ఆయ‌న సోద‌రి మీసా భార‌తి, కాంగ్రెస్ నాయ‌కుడు మోహ‌న్ జా, దివంగ‌త నేత స‌దానంద్ సింగ్, ఆయ‌న కుమారు శుభానంద్ ముఖేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజేశ్ రాథోడ్ పేర్లను కూడా పిటిష‌న్‌లో ప్రస్తావించారు. దీనిపై విచారించిన పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విజయ్ కిషోర్ సింగ్.. ఈ ఆరుగురు నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించాలని ఆదేశించారు. కాగా.. కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది సంజీవ్ కుమార్ సింగ్ ఆగస్టు 18న పాట్నాలోని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సంజీవ్ కుమార్ సింగ్ కాంగ్రెస్ మద్దతుదారుడు. కాగా భ‌గ‌ల్‌పూర్ సీటు నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తేజస్వీ యాదవ్‌కు డబ్బులు ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు.

Also Read:

Viral Video: ఫ్రెండ్‌షిప్‌ అంటే ఈ గుర్రం, మేకలదే గురూ.. మనుషులు సైతం కుళ్లుకునేలా.. వీడియో వైరల్‌

Raj Kundra: రాజ్ కుంద్రా కేసులో మరో కోణం.. ఆ పోర్న్ వీడియోలు అమ్మేందుకు భారీ డీల్.!