Patanjali: సమాజం కోసం పతంజలి కృషి ఎంతో తెల్సా…

|

Mar 21, 2025 | 8:11 PM

ఈ రోజు పతంజలి యోగపీఠం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాబా రామ్‌దేవ్ స్థాపించిన ఈ సంస్థ నేడు భారతీయ ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తోంది. దీని లక్ష్యం కేవలం ఆయుర్వేద ఉత్పత్తులను అమ్మడం మాత్రమే కాదు, సమగ్రమైన, సమతుల్య సమాజాన్ని సృష్టించడం.

Patanjali: సమాజం కోసం పతంజలి కృషి ఎంతో తెల్సా...
Baba Ramdev
Follow us on

నేటి బిజీ జీవితంలో, ప్రజల జీవనశైలి పూర్తిగా మారుతోంది. విద్యా, వ్యాపారం, కుటుంబ పరమైన ఒత్తిళ్ల మధ్య ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే మీ ఆరోగ్యం గురించి మీకు శ్రద్ద లేకపోయినా పతంజలికి ఉంది. పతంజలి గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు  ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలోనే నేటి కాలంలో, పతంజలి ప్రజల జీవితాల్లో అనేక విధాలుగా మార్పులను తీసుకువస్తోంది. పతంజలి ఆధ్యాత్మిక లక్ష్యం గురించి వివరంగా తెలుసుకుందాం.

లక్షలాది మంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఓ ప్రేరణ

పతంజలి యోగాను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం కాదని ప్రజలకు వివరించింది. ఇది ఒక ఆధ్యాత్మిక సాధన అన్న విషయాన్ని జనజీవనంలోకి తీసుకెళ్లింది. యోగా జీవితంలోని ప్రతి అంశంలోనూ సమతుల్యతను తెస్తుందని అర్థమయ్యేలా చేసింది. బాబా రామ్‌దేవ్ ఉచిత యోగా శిబిరాలు, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా లక్షలాది మందిని యోగాకు అనుసంధానం చేశారు. ఇది వారిని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి కూడా ప్రేరేపించింది.

భారతీయ సంప్రదాయాలను పునరుద్ధరణకు ఓ వారధి

ప్రస్తుతం ఏ జబ్బు వచ్చినా వెంటనే మాత్రలు వేసుకోవడం అలవాటుగా మారిపోయింది. కానీ పతంజలి యోగపీఠ్ ఆయుర్వేదం ద్వారా ప్రజలు శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది. పతంజలి ఆరోగ్య వ్యవస్థ ప్రకృతి వైద్యం, మూలికలు, సమతుల్య జీవనశైలిపై ప్రధానంగా ఫోకస్ పెడుతుంది. ఆయుర్వేదం, ప్రకృతి వైద్య విధానం అనేది భారతదేశ పురాతన సంప్రదాయం. ఇది శారీరక రుగ్మతలను నయం చేయడమే కాకుండా మానసిక శాంతి, ఆధ్యాత్మిక పురోగతికి కూడా ఉపకరిస్తుంది.

పతంజలి విద్యా కేంద్రాలు ద్వారా పెను మార్పులు

నేడు బాబా రాందేవ్ పతంజలి అనేక గురుకులాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రారంభించింది. ఇక్కడ విద్యార్థులకు వేద విద్య, యోగా, ఆయుర్వేదం గురించి బోధన జరుగుతుంది. దీని ద్వారా, పతంజలి ఆధునిక విద్యా వ్యవస్థను అలాగే వేద సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

భారతీయ విలువలకు ప్రోత్సాహం

పతంజలి భారతీయ సంస్కృతి, స్వాతిక ఆహారంతో పాటు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించింది. ఈ విధంగా ఆధ్యాత్మిక. సాంస్కృతిక పునరుజ్జీవనానికి సహకారం అందిస్తుంది. పతంజలి లక్ష్యం కేవలం ఉత్పత్తుల అమ్మకానికే పరిమితం కాకుండా భారతీయ విలువలను ప్రోత్సహించడం… ప్రజలలో స్వావలంబన,  స్వీయ సంతృప్తి భావాన్ని పెంపొందించడం కూడా.

వ్యాపారానికి అతీతంగా జీవితాన్ని మార్చే ప్రయాణం

పతంజలి నేడు సామాజిక సేవలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. విపత్తుల సమయంలో సహాయక చర్యల సహా గో సంరక్షణ కేంద్రాలు, పర్యావరణ పరిరక్షణ ప్రచారాల వరకు సమగ్రమైన, సమతుల్య సమాజాన్ని సృష్టించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. పతంజలి యోగపీఠ్ కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు. భారతీయ జీవనశైలిని పునరుద్ధరణకు ఓ వారధి పతాంజలి సమాజాన్ని స్వావలంబన, స్వయం సమృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తుంది.