Party Wise Election Results 2026 Winners: తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. బెంగాల్‌లో కమల వికాసం.. 5 రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..

All Party Alliance Wise Election Results 2026 and Winners in Telugu: పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా.. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ విజయానికి చేరువలో ఉండగా.. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది.

Party Wise Election Results 2026 Winners: తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. బెంగాల్‌లో కమల వికాసం.. 5 రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
Election Results

Updated on: May 04, 2026 | 11:50 AM

పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా.. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ విజయానికి చేరువలో ఉండగా.. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. అసోంలో BJP హ్యాట్రిక్ విజయం సాధించింది. పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించింది. మొత్తానికి మూడు రాష్ట్రాల్లో అధికారం మారనుంది. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ, తమిళనాడులో స్టాలిన్ పార్టీ డీఎంకే, కేరళలో విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ పరాజయం పాలయ్యాయి.

రాష్ట్రాల వారీగా ఎన్నికల ఫలితాలు..

ఈ పెద్ద రాష్ట్రాల ఫలితాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కైడా వెలువడుతున్నాయి.. మహారాష్ట్రలోని బారామతి, రాహురిలలో జరిగిన రెండు అత్యంత ముఖ్యమైన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలను కూడా ఈరోజు ప్రకటిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో ఈ కింద సులువుగా తెలుసుకోండి..

Follow Us