నీట్, జేఈఈ పరీక్షలు జరుగుతాయి, కేంద్రం

| Edited By: Anil kumar poka

Aug 26, 2020 | 10:58 AM

నీట్,,   జేఈఈ పరీక్షలను నిర్వహించాలని విద్యార్థుల తలిదండ్రులు, విద్యార్థులు కూడా కోరుతున్నారని విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ తెలిపారు.

నీట్, జేఈఈ పరీక్షలు జరుగుతాయి, కేంద్రం
Ramesh Pokhriyal
Follow us on

నీట్,,   జేఈఈ పరీక్షలను నిర్వహించాలని విద్యార్థుల తలిదండ్రులు, విద్యార్థులు కూడా కోరుతున్నారని విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ తెలిపారు. 80 శాతం మంది స్టూడెంట్స్ జేఈఈ ఎగ్జామ్స్ కోసం అప్పుడే అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు ఎందుకు అనుమతించడం లేదని చాలామంది తలిదండ్రులు ప్రశ్నిస్తున్నారని, దీంతో తాము వీటిని నిర్వహించాలనే అనుకుంటున్నామని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జేఈఈ కోసం రిజిస్టర్ చేసుకున్న 8.5 లక్షల మంది విద్యార్థుల్లో 7.25 లక్షలమంది అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవడం చూస్తే, వారి ఆసక్తి ఎంతగా ఉందో అర్థమవుతోందని రమేష్ పోఖ్రియాల్ అన్నారు. మాకు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం అని పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని చాలామంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. స్కూళ్లను మళ్ళీ ప్రారంభించే విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. హోమ్, ఆరోగ్య మంత్రిత్వ శాఖల గైడ్ లైన్స్ ప్రకారం తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.

వచ్ఛే సెప్టెంబరులో నీట్, జేఈఈ ఎగ్జామ్స్ జరగవలసి ఉన్నాయి.