Rahul Gandhi: సాగు చట్టాల నిరసనలో మరణించిన రైతులకు ఉద్యోగం, పరిహారం కేంద్రం బాధ్యతః రాహుల్ గాంధీ

|

Dec 07, 2021 | 3:42 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

Rahul Gandhi: సాగు చట్టాల నిరసనలో మరణించిన రైతులకు ఉద్యోగం, పరిహారం కేంద్రం బాధ్యతః రాహుల్ గాంధీ
Rahul Gandhi
Follow us on

Rahul Gandhi on Farm Laws: వ్యవసాయ చట్టాల అంశంపై మంగళవారం లోక్‌సభలో జరిగిన శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిందీశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని రాహుల్ డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో శీతాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ, రైతులకు వారి హక్కులు కల్పించాలని, వారికి పరిహారంతో పాటు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కోరారు.

రైతులు, సాగు చట్టాల అంశంపై లోక్‌సభలో నేడు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాహుల్‌ గాంధీ.. అనంతరం దీనిపై ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ తన తప్పును అంగీకరించి.. రైతులకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రైతు చట్టాల నిరసనలో మరణించిన రైతులపై ఎటువంటి సమాచారం లేదని రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. రైతు ఉద్యమంలో సుమారు 700 మంది రైతులు మరణించారని, అయితే ప్రభుత్వం వద్ద ఆ డేటా లేదని ఆరోపించారు. అయితే, ఈ ఉద్యమంలో ఎంతమంది అన్నదాతలు మరణించారని నవంబరు 30న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని ప్రశ్నించగా.. అందుకు సంబంధించిన డేటా తమ వద్ద లేదని చెప్పారు. కానీ, సాగు చట్టాలపై జరిపిన పోరాటంలో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి వివరాలను సభకు అందజేస్తున్నా’’ అని రాహుల్‌ వెల్లడించారు.


మరణించిన రైతుల కుటుంబాలకు మరియు హర్యానాకు చెందిన రైతుల పేర్లకు ఇచ్చిన నష్టపరిహారంపై పంజాబ్ ప్రభుత్వం నుండి డేటాను లోక్‌సభలో పెడతానని ఆయన చెప్పారు. “రైతుల ఆందోళనలో దాదాపు 700 మంది రైతులు ప్రాణాలను కోల్పోయారన్నారు. పంజాబ్‌ నుంచి దాదాపు 400 మంది రైతులు ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. వారికి పంజాబ్‌ ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున పరిహారం అందించింది. మరణించిన వారిలో 152 మంది రైతుల కుటుంబాల్లో.. ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. హరియాణా నుంచి మరణించిన రైతుల వివరాలు లేవని మీ ప్రభుత్వం చెబుతోంది. ఆ జాబితా కూడా ఇస్తున్నాం. పరిహారం ఇవ్వండి. అన్నదాతలకు హక్కులు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని రాహుల్‌ గాంధీ చెప్పుకొచ్చారు.

కాగా, రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించే వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) అధికారిక ప్రకటనలో తెలిపింది. పెండింగ్‌లో ఉన్న రైతుల డిమాండ్ల ఆధారంగా రైతుల ఆందోళన భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఈ డిమాండ్లలో కనీస మద్దతు ధర (MSP) కోసం చట్టపరమైన హామీ, ఆందోళన సమయంలో మరణించిన రైతుల బంధువులకు పునరావాసం కల్పించేంతవరకు పోరాడుతామన్నారు.

Read Also…  PM Modi Tour: ప్రధాని మోడీ 2022 విదేశీ ప్రయాణ క్యాలెండర్ ప్రారంభం అక్కడినుంచే.. ఎందుకోసమో తెలుసా..?