
కత్తులతో పుట్టినోడు ఆ కత్తులతోనే పోతాడని ఊరికే అనలేదు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే. దాదాపు క్లయిమాక్స్‌లో పడింది. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలన్న యావతో, దేశభక్తి మితిమీరి, మతం ముసుగు తొడిగి, కుట్రలు, కుయుక్తులతో చేసిన పన్నాగాలు వాళ్లకే తిప్పికొడుతున్నాయి. పాకిస్తాన్ పెంచిపోషించిన పాములు వాళ్ల మీదికే బుసలు కొడుతున్నాయి. ఫలితం… దేశం అంతర్భాగంలో రోజుకో విధ్వంసం.. ఒళ్లంతా గాయాలై రోజురోజుకూ కుంగి కృశించిపోతోంది పాక్. నోరు గొప్ప-ఊరు దిబ్బ అన్నట్టుంది పక్కనున్న పాకిస్తాన్ పరిస్థితి. ఉగ్రవాదాన్ని ఎగదోసి ఆ ఉగ్రవాదం చేతుల్లోనే చిత్తడైపోతున్న పాకిస్తాన్ భారత్‌ను మళ్లీమళ్లీ రెచ్చగొడుతున్న తీరు ఇది. సింధూ నదీజలాల్లో వాటా అడిగితే చేతులు నరికేస్తామంటున్న ఈ పెద్దమనిషి పేరు ముసాదిక్ మాలిక్.. పాకిస్తాన్ దేశానికి పర్యావరణ మంత్రి. పరాయిదేశం మీద విర్రవీగడానికి ముందు నీ కిందుండే నలుపును చూసుకోమని మన విదేశాంగశాఖ ఆల్రెడీ రియాక్టయింది. ఔను, పాకిస్తాన్ దేశం పీకల్లోతు కష్టాల్లో ఉందనేది కొత్త విషయం కాదు. పక్కలో నిలబడి పొడుస్తున్న ఆఫ్ఘనిస్తాన్, గుండెల మీద అదేపనిగా తంతున్న బెలూచిస్తాన్, తానే పెంచిపోషించిన టెర్రరిజం.. అన్నీకలిసి నాలుగువైపులా రౌండప్ చేసి, పాక్ పెద్దలకు నిద్రలేని రాత్రుల్నిస్తున్నాయి. తాను తీసుకున్న గొయ్యిలో తనే పడి… తన కంట్లో తనే...