కశ్మీర్ పై ఏం చేద్దాం ? పాక్ లో ఇమ్రాన్ ఖాన్ హైలెవెల్ మీటింగ్ !

|

Aug 04, 2019 | 5:01 PM

కశ్మీర్ లో నెలకొన్న తాజా పరిస్థితులు ఇటు భారత్ తో బాటు పాకిస్తాన్ లోనూ టెన్షన్ సృష్టిస్తున్నాయి. అత్యధికంగా బలగాల మోహరింపు నేపథ్యంలో వస్తున్న వార్తలపై స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జాతీయ భద్రతా కమిటీతో భేటీ అయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి భారత్ క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తోందన్న తమ దేశ సైనికాధికారుల ఆరోపణపై ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే కశ్మీర్ లోని పీవోకే, నియంత్రణ రేఖ వెంబడి […]

కశ్మీర్ పై ఏం చేద్దాం ? పాక్ లో  ఇమ్రాన్ ఖాన్ హైలెవెల్ మీటింగ్ !
Follow us on

కశ్మీర్ లో నెలకొన్న తాజా పరిస్థితులు ఇటు భారత్ తో బాటు పాకిస్తాన్ లోనూ టెన్షన్ సృష్టిస్తున్నాయి. అత్యధికంగా బలగాల మోహరింపు నేపథ్యంలో వస్తున్న వార్తలపై స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జాతీయ భద్రతా కమిటీతో భేటీ అయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి భారత్ క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తోందన్న తమ దేశ సైనికాధికారుల ఆరోపణపై ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే కశ్మీర్ లోని పీవోకే, నియంత్రణ రేఖ వెంబడి ఏర్పడుతున్న పరిస్థితులపై ఆయన సమీక్షించినట్టు సమాచారం. పైగా.. కశ్మీర్ వివాద పరిష్కారానికి భారత్ కోరితే మధ్యవర్తిత్వం వహించడానికి తాను రెడీగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖాన్ తన ట్వీట్లలో గుర్తు చేశారు. (ట్రంప్ జోక్యాన్ని భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే). ఇండియా దూకుడుగా వ్యవహరిస్తోందని, నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలను సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా.. భారత దళాలు క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తున్నాయని పాకిస్తాన్ కొత్త ఆరోపణ చేసింది.

అయితే పాక్ మంత్రి తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫోటోలు మోర్టార్ కాల్పులకు సంబంధినవని, క్లస్టర్ బాంబు పేలుళ్లకు సంబంధించినవి కావని ఇండియా స్పష్టం చేసింది. మరోవైపు.. తమ సైన్యం పీవోకే ను దాటి భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిందన్న వార్తలు నిజం కాదని పాకిస్థాన్ ఆర్మీ పేర్కొంది. పీవోకే దాటి వఛ్చిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ ను తాము ఎదుర్కొన్నామని, మన జవాన్లు జరిపిన కాల్పుల్లో సుమారు ఏడుగురు మరణించారని భారత దళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ దీన్ని ఖండిస్తూ.. కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచ దేశాల దృష్టిని మరల్చేందుకే భారత్.. ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నారు.