Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు కంపించిన భూమి

|

Sep 11, 2024 | 2:52 PM

పాకిస్థాన్‌లో బుధవారం(సెప్టెంబర్ 11) భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించింది.

Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు కంపించిన భూమి
Earthquake
Follow us on

పాకిస్థాన్‌లో బుధవారం(సెప్టెంబర్ 11) భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించింది. ఈ భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్‌సీఆర్, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లోనూ కనిపించింది. భూకంప కేంద్రం పాకిస్థాన్‌ అని అధికారులు చెబుతున్నారు.

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, లాహోర్‌లలో కూడా భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ఈ తీవ్రత ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లలో కూడా భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా భూకంపం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భూకంపం కారణంగా భూమి కంపించడం రెండు వారాల్లో ఇది రెండోవసారి కావడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..