బాలాకోట్ కాదు, దానికంటే మించిన కఠినమైన చర్య ఉండాలిః ఫరూఖ్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పహల్గామ్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పిరికిపంద దాడులు చేయడం ద్వారా భారతీయులను బలహీనపరచాలనుకుంటున్నారు. కానీ దీని వల్ల మనం బలహీనంగా మారడం లేదన్నారు. భారతీయులం మరింత బలంగా మారుతున్నామన్నారు. పాకిస్థాన్‌కు తగిన సమాధానం ఇస్తామన్నారు.

బాలాకోట్ కాదు, దానికంటే మించిన కఠినమైన చర్య ఉండాలిః ఫరూఖ్ అబ్దుల్లా
Farooq Abdullah On As Dulat Book

Updated on: Apr 28, 2025 | 5:26 PM

జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్(JKNC) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సోమవారం(ఏప్రిల్ 28) పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాకిస్థాన్‌ వక్రబుద్ధిపై విరుచుకుపడ్డారు. మానవత్వాన్ని హత్య చేసిందని, నేటికీ పాకిస్తాన్ అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇలా చేయడం ద్వారా మనం పాకిస్తాన్‌తో వెళ్తామని వారు భావిస్తే, వారి మూర్ఘత్వం అవుతుందని అన్నారు. పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు ఫరూక్ అబ్ధుల్లా.

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పహల్గామ్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పిరికిపంద దాడులు చేయడం ద్వారా భారతీయులను బలహీనపరచాలనుకుంటున్నారు. కానీ దీని వల్ల మనం బలహీనంగా మారడం లేదన్నారు. భారతీయులం మరింత బలంగా మారుతున్నామన్నారు. పాకిస్థాన్‌కు తగిన సమాధానం ఇస్తామన్నారు. ‘‘నేను ఎప్పుడూ భారత్ – పాక్ మధ్య సంభాషణ జరగాలని కోరుకునేవాడిని, కానీ మనం మాట్లాడుతున్న బాధితుల కుటుంబాలకు ఏమి చెబుతాం? మాట్లాడటం న్యాయమా?’’ అన్నారు. ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాల్సిందే అన్నారు ఫరూక్ అబ్దుల్లా.

‘‘మానవత్వానికి వ్యతిరేకంగా నేరం చేసిందని మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఇంకా అర్థం చేసుకోకపోవడం చాలా బాధగా ఉంది’’ అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. రెండు దేశాల సిద్ధాంతాన్ని అంగీకరించడానికి మనం ఇంకా సిద్ధంగా లేమన్నారు. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు లేదా మరెవరైనా, మనమందరం ఒకటే. ఇలా ఆలోచించేవారు మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అది అలా కాదు. మేము మరింత బలపడుతున్నామని ఫరూక్ అబ్దుల్లా తేల్చి చెప్పారు. భారతీయులను వీడదీయలేరని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ చర్యల వల్ల మనం పాకిస్తాన్‌కు వెళ్తామనే వారి (పాకిస్తాన్) అపోహను తొలగించాలనుకుంటున్నామన్నారు. ‘‘1947లో మనం పాకిస్తాన్‌తో వెళ్లనప్పుడు, ఇప్పుడు మనం ఎందుకు వెళ్తాము? ఆ సమయంలో మనం రెండు దేశాల సిద్ధాంతాన్ని నీటిలోకి విసిరేశాము. నేటికీ మనం రెండు దేశాల సిద్ధాంతాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేము” అని ఆయన అన్నారు. ‘నేను ఎప్పుడూ పాకిస్తాన్‌తో చర్చలకు అనుకూలంగా ఉన్నాను. కానీ పహల్గామ్ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన మన వారికి మనం ఏ సమాధానాలు ఇస్తాము? మనం తీర్పు చెబుతున్నామా? బాలాకోట్ కాదు, కేంద్రం అంతకు మించిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటోంది, తద్వారా ఇలాంటి దాడులు మళ్లీ జరగవు. పాకిస్థాన్‌కు తగిన సమాధానం ఇస్తాము’’ అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.

ఇదిలావుంటే, ఢిల్లీలో వరుస సమావేశాలు.. ఇప్పటికే యుద్ధ భయంతో గజ్జుమంటున్న పాకిస్థాన్‌కు పిచ్చెక్కిపోయేలా చేస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ భేటీ అయ్యారు. సరిహద్దులో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్దతపై చర్చించారు. ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలపై మోదీకి వివరించారు రాజ్‌నాథ్‌. ఈ సమావేశానికి NSA అజిత్‌ దోవల్‌ సైతం హాజరవ్వడం పాక్‌ వెన్నులో వణుకుపుట్టేలా చేస్తోంది. అంతకుముందు ఆర్మీ చీఫ్‌తో భేటీ అయ్యారు రాజ్‌నాథ్‌ సింగ్. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి, ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

వీడియో చూడండి… 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..