Oxygen Expresses: ఆక్సిజన్‌ సరఫరాలో రైల్వే శాఖ కీలక పాత్ర.. 14 రాష్ట్రాలకు 15,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్

|

May 23, 2021 | 7:10 PM

Oxygen Expresses: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఆక్సిజన్‌ కొరతతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు ప్రభుత్వంతో పాటు..

Oxygen Expresses: ఆక్సిజన్‌ సరఫరాలో రైల్వే శాఖ కీలక పాత్ర.. 14 రాష్ట్రాలకు 15,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
Follow us on

Oxygen Expresses: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఆక్సిజన్‌ కొరతతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ముందుకు వచ్చి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నాయి. అలాగే విమానాలు, రైళ్ల నుంచి ఆక్సిజన్‌ రవాణా కొనసాగుతోంది. ఆక్సిజన్‌ సరఫరాలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు 15,284 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్ఎంఓ) 936 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. ఆదివారం ఉదయం తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌కు అసోంకు చేరిందని, 4 ట్యాంకర్లలో 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను అసోంకు డెలివరీ చేశామని రైల్వే శాఖ తెలిపింది. 234కు పైగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను ఇంతవరకూ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నడిపినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. రోజువారీ 800 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్‌ను సరఫరా చేసినట్లు తెలిపింది.

ఆదివారం నాడు 31 ట్యాంకర్లలో 569 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓ‌తో 9 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇంతవరకూ చేరుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోం ఉన్నాయి. గత 29 రోజులుగా ఈ ప్రత్యేక రైళ్లు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి. ఆక్సిజన్‌ సరఫరాలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ముందు ఆక్సిజన్‌ కొరతతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణవాయువు సరఫరాతో ఎన్నో ప్రాణాలు దక్కుతున్నాయి.

ఇవీ చదవండి:

Inter Exams: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇంటి నుంచే పరీక్షలు.. వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు, రెండో డోసు మధ్య గ్యాప్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది: అమెరికా