జమ్ముకశ్మీర్‌ బిల్లులో 52 తప్పులు.. “ఐ” అక్షరం మాయం.. “టీ” అక్షరం ప్రత్యక్షం..!

| Edited By:

Sep 13, 2019 | 10:06 AM

జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తప్పులు దొర్లాయి. మొత్తం ఈ బిల్లులో 52 తప్పులను గుర్తించారు. అయితే ఈ తప్పులను సరిచేస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల తప్పొప్పుల పట్టికను విడుదల చేసింది. ఈ బిల్లులోని వాక్యాల్లో ఉన్న చాలా పదాల్లో.. ఇంగ్లీష్ అక్షరాలు చెరిగిపోగా.. మరి కొన్ని పదాల్లో “T’ అనే ఆంగ్ల అక్షరం అదనంగా వచ్చి చేరింది. ఆర్టికల్ అనే పదంలో “ఐ” లేకుండా పోయింది. అలాగే టెరిటరీ అన్న పదంలో ఒక “టీ” అక్షరం […]

జమ్ముకశ్మీర్‌ బిల్లులో 52 తప్పులు.. ఐ అక్షరం మాయం.. టీ అక్షరం ప్రత్యక్షం..!
Follow us on

జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తప్పులు దొర్లాయి. మొత్తం ఈ బిల్లులో 52 తప్పులను గుర్తించారు. అయితే ఈ తప్పులను సరిచేస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల తప్పొప్పుల పట్టికను విడుదల చేసింది. ఈ బిల్లులోని వాక్యాల్లో ఉన్న చాలా పదాల్లో.. ఇంగ్లీష్ అక్షరాలు చెరిగిపోగా.. మరి కొన్ని పదాల్లో “T’ అనే ఆంగ్ల అక్షరం అదనంగా వచ్చి చేరింది. ఆర్టికల్ అనే పదంలో “ఐ” లేకుండా పోయింది. అలాగే టెరిటరీ అన్న పదంలో ఒక “టీ” అక్షరం బదులుగా రెండు “టీ” అక్షరాలు అచ్చుఅయ్యాయి. 1909 సంవత్సరాన్ని రాయాల్సిన చోట 1951 అనే సంవత్సరం ముద్రించారు. ఇలా చిన్న చిన్న తప్పులు బిల్లులో దొర్లాయి. అయితే ఆ తప్పులన్నింటిని ప్రభుత్వం సవరించింది. ఈ మార్పులన్నీ అక్టోబరు 31 నుంచి అమలులోకి రానున్నాయి.