Fire Accident: మూగజీవాల ప్రాణం తీసిన డంపింగ్ యార్డ్.. గోశాలలోని 38 ఆవులు అగ్నికి ఆహుతి..

38 Cows Killed in Fire Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఓ గోశాలలోని 38 ఆవులు మృత్యువాతపడ్డాయి.

Fire Accident: మూగజీవాల ప్రాణం తీసిన డంపింగ్ యార్డ్.. గోశాలలోని 38 ఆవులు అగ్నికి ఆహుతి..
Cow

Updated on: Apr 12, 2022 | 9:11 AM

38 Cows Killed in Fire Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఓ గోశాలలోని 38 ఆవులు మృత్యువాతపడ్డాయి. ఘజియాబాద్ డంప్ యార్డ్‌లో చెలరేగిన మంటలు.. ఇందిరాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కనవాని గ్రామంలోని గోశాల వరకు వ్యాపించాయి. ఈ మంటల్లో గోశాలలోని 38 ఆవులు చిక్కుకుని మరణించాయని శ్రీకృష్ణ గోశాల నిర్వాహకుడు సూరజ్ పండిట్ వెల్లడించారు. సోమవారం ఈ అగ్ని ప్రమాదం జరిగినపుడు గోశాలలో 150 ఆవులున్నట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దింపినట్లు ఘజియాబాద్ పోలీసు చీఫ్ మునిరాజ్ తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ రాకేష్ కుమార్ సింగ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై విచారణకు కమిటీని నియమించినట్లు వెల్లడించారు.

అగ్నిప్రమాదంపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీలో సర్కిల్ ఆఫీసర్ అభయ్ కుమార్ మిశ్రా కూడా ఉన్నారు. గోశాలకు సమీపంలోనే డంపింగ్ యార్డు ఉందని మిశ్రా తెలిపారు. ఎండలు కూడా బాగా పెరగడంతో.. మధ్యాహ్నం సమయంలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు. డంపింగ్ యార్డు సమీపంలో గోశాల ఉందని..దీంతో ఆవులకు హాని కలిగే ప్రమాదం ఉందని గతంలోనే ఫిర్యాదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గోశాల నిర్వాహకులు వెల్లడించారు.

Also Read:

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యలపై తుది తీర్పు నేడే.. సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ..

RBI: ఆ 4 బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా.. కారణం ఏంటంటే..!