ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ తనిఖీలు.. ఓ ప్యాసింజర్ సూట్‌కేస్ చెక్ చేయగా షాక్

తిరుచ్చి విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న తాబేళ్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి లగేజీ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుంది. ఈ తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.

ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ తనిఖీలు.. ఓ ప్యాసింజర్ సూట్‌కేస్ చెక్ చేయగా షాక్
Chocolate Boxes

Updated on: Dec 29, 2024 | 10:54 PM

విమానాశ్రయాల్లో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కస్టమ్స్ అధికారులు అలెర్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయినా స్మగ్లర్లు కొత్త కొత్త ఎత్తుగడలతో తమ అక్రమ రవాణా దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న తాబేళ్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమానంలోని ఓ ప్రయాణీకుడి లగేజీ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి  తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఓ ప్రయాణీకుడి లగేజీని అనుమానంతో తనిఖీ చేయగా ఛాక్లెట్ బాక్సుల్లో బతికున్న తాబేళ్లను గుర్తించారు.

దాదాపు 8 చాక్లెట్ బాక్సుల్లో అక్రమంగా తరలిస్తున్న 2447 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తిరుచ్చి కస్టమ్స్ కమిషనరేట్ తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఈ విషయమై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసు కేసు నమోదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి తమ విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను సీజ్ చేసిన కస్టమ్స్