శబరిమలకు భారీగా పోలీసు బలగాలు.. ఎందుకు ?

| Edited By:

Nov 13, 2019 | 4:21 PM

శబరిమలకు ఇక భక్తులతో బాటు పోలీసులు కూడా ‘ పోటెత్తనున్నారు ‘. సుమారు 10 వేలమంది పోలీసులను దశలవారీగా అక్కడికి తరలించడానికి రంగం సిధ్దమైంది. ఈ నెల 16 నుంచి రెండు నెలల పాటు ‘ మండల మకర విళక్కు ‘ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ఆవరణలో పోలీసులు బిలబిలమంటూ కనిపించబోతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో అన్ని వయసుల మహిళలూ ఆలయ ప్రవేశం చేయవచ్చునని సుప్రీంకోర్టు ఉత్తర్వులివ్వడంతో పెద్ద ఎత్తున హింస, అల్లర్లు జరిగిన […]

శబరిమలకు భారీగా పోలీసు బలగాలు.. ఎందుకు ?
Follow us on

శబరిమలకు ఇక భక్తులతో బాటు పోలీసులు కూడా ‘ పోటెత్తనున్నారు ‘. సుమారు 10 వేలమంది పోలీసులను దశలవారీగా అక్కడికి తరలించడానికి రంగం సిధ్దమైంది. ఈ నెల 16 నుంచి రెండు నెలల పాటు ‘ మండల మకర విళక్కు ‘ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ఆవరణలో పోలీసులు బిలబిలమంటూ కనిపించబోతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో అన్ని వయసుల మహిళలూ ఆలయ ప్రవేశం చేయవచ్చునని సుప్రీంకోర్టు ఉత్తర్వులివ్వడంతో పెద్ద ఎత్తున హింస, అల్లర్లు జరిగిన సంగతి విదితమే. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా ఈ సారి అలాంటి పరిస్థితిని నివారించేందుకు అయిదు దశలుగా పోలీసు బలగాలను తరలిస్తున్నారు. ఈ నెల 16 న భక్తులకు ఆలయ తలుపులు తెరవనున్నారు. అన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాలన్న కోర్టు తీర్పును సవాలు చేస్తూ పలు రివ్యూ పిటిషన్లు అత్యున్నతన్యాయ స్థానంలో దాఖలయ్యాయి. వీటిపై కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.