Corona: కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. సెకండ్‌వేవ్‌లో చిన్నారులను వదిలి పెట్టడం లేదు. కరోనా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్రాలో కరోనా కట్టడికి కఠినమైన చర్యలు చేపడుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కరోనా మహమ్మారి చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఇరవై రోజుల్లోనే పదివేలకుపైగా చిన్నారులు కరోనా బారిన పడ్డారు. స్టేట్ కోవిడ్ కంట్రోల్ రూమ్ గణాంకాల ప్రకారం.. మే 1 నుంచి 20వ తేదీ మధ్య 9 ఏళ్లలోపు చిన్నారులు 2044 మందికి కరోనా సోకింది. అదే విధంగా 10 నుంచి 19 ఏళ్ల టీనేజర్లు 8661 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వెల్లడైంది. ఇక రాష్ట్రంలో 20 రోజుల్లో 1,22,949 మందికి కరోనా సోకింది.
కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 3626 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,07,566కు చేరింది. ఇందులో 63,373 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2,38,593 మంది బాధితులు కోలుకున్నారు. 5600 మంది కరోనాతో మరణించారు.
ఫస్ట్ వేవ్‌లో కరోనా పిల్లలకుపై పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఈ సెకండ్ వేవ్‌లో చిన్నారులను వదిలి పెట్టడం లేదు. ప్రతి ఒక్కరిని కరోనా వెంటాడుతోంది. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే.. మరో వైపు పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.