కాంగ్రెస్‌పార్టీ కితకితలకేం తక్కువ లేదు.. సినిమాల్లో జమాజెట్టీలకు ఇచ్చే ఆస్కార్ అవార్డుల్లా భారత రాజకీయరంగస్థలంలో గొప్పగా నటిస్తున్నవారికి కూడా అవార్డులిస్తే పోలా అనుకుంది కాంగ్రెస్ పార్టీ.. జ్యూరీ ఆ పార్టీనే కాబట్టి ఇందులోంచి తనను తాను మినహాయించేసుకుంది.. ఆ పార్టీ ట్విట్టర్ అకౌంట్‌లో బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ రోల్.. బెస్ట్ కామెడీ రోల్… బెస్ట్ విలన్ ఇలా ప్రతి విభాగాల్లో నామినేషన్లను… ఆపై విన్నర్లను కూడా ప్రకటించింది… మామూలుగా పోస్ట్ చేస్తే అట్రాక్టివ్‌గా ఉండదని భావించి బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. విజువల్ ఎఫెక్ట్స్‌తో వీడియోలు కూడా పోస్టు చేసింది కాంగ్రెస్… ఇక అవార్డులు గెల్చుకున్న వారి విషయానికి వస్తే… బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ రోల్ అవార్డును ఈసారి ప్రధాని నరేంద్రమోదీకి ప్రకటించింది.. ఈ అవార్డు కోసం ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు కూడా పోటీ పడినప్పటికీ 56 అంగుళాల ఛాతీ… సన్నివేశాలను పండించేందుకు కాసిన్ని కన్నీళ్లు.. కొన్ని చెమటచుక్కలు రాల్చగలరు కాబట్టే మోదీకే ఈ అవార్డు అని కాంగ్రెస్ వివరణ ఇచ్చుకుంది.. ఇక బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కట్టబెట్టింది.. ఒకప్పుడు షోలేలో గబ్బర్‌సింగ్, మిస్టర్ ఇండియాలో మొగాంబో లాంటివాళ్లు బెస్ట్ విలన్స్… ఇప్పుడు కొత్త కొత్త విలన్లు వస్తున్నారని చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఈ కేటరిగిలో కొన్ని నామినేషన్లను కూడా ప్రకటించింది.
ఈ అవార్డు కోసం అమిత్‌షాతో పాటు యోగి ఆదిత్యనాథ్, అనురాగ్ ఠాకూర్‌లు పోటీపడ్డారట! బెస్ట్ కమెడియన్ అవార్డును బీజేపీ ఎంపీ మనోజ్ తివారికి ఇచ్చింది… ఈ కేటగిరిలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ఉన్నా… వీరిద్దరి కంటే మనోజ్ తివారినే జనాన్ని ఎక్కువ నవ్వించాడని కాంగ్రెస్ పేర్కొంది… బాధల నుంచి బయటపడేందుకు కొంత కామెడీని కోరుకోవడం సహజం కాబట్టి మనోజ్ తివారీ వేస్తున్న యోగాసనాల వీడియో చూసి హాయిగా నవ్వుకోండని ప్రకటించింది కాంగ్రెస్…ఇక్కడే కాంగ్రెస్‌కు కొంచెం ఎదురుతన్నింది.. ఈ పోస్ట్ కింద విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి.. బెస్ట్ కమెడియన్ అవార్డుకు రాహుల్‌గాంధీకి మించినవారుండరంటూ సెటైర్లతో కూడిన కామెంట్లను.. మెమ్స్‌ను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. అన్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా వదల్లేదు కాంగ్రెస్… ఆయనకు బెస్ట్ డ్రమాటిక్ రోల్ అవార్డును ఇచ్చింది.. ఈ కేటగిరిలో స్మృతీ ఇరానీ .. నరేంద్రమోదీ… కేజ్రీవాల్‌ను నామినేషన్లలో చూపించింది కాంగ్రెస్… తాను ఎప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయనని.. పదవులకు దూరంగా ఉంటానని అప్పుడెప్పుడో కేజ్రీవాల్ చెప్పిన వీడియోను పోస్టు చేసింది కాంగ్రెస్…
When things get dark, when the times are tough, we can all do with a little comedy to cheer us up. Fortunately we have these timeless moments to get us through. Here are the nominations & winner for best actor in a Comedic role. #Oscars pic.twitter.com/bzoxqEMuSM
— Congress (@INCIndia) February 10, 2020