AIADMK Politics: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు సొంత పార్టీ అన్నాడీఎంకేలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. పన్నీర్ సెల్వంపై అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఇప్పటికే వేటు వేశారు. ఈ క్రమంలోనే ఆయన మరో షాకిచ్చారు. పన్నీర్ సెల్వం కుమారులతో సహా మరో 16 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వీరంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పళనిస్వామి. ఈ కారణం వల్లే వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీంతో, పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి వెళ్లిపోయాయి. పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సాకు చూపి అత్యంత అవమానకరస్థితిలో పన్నీర్‌ను పార్టీ నుంచి బయటకు పంపింది పళని వర్గం. ఆయన అనుచరులపైనా బహిష్కరణ వేటు వేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసి..పదవుల నుంచి తప్పించింది. రెండ్రోజుల క్రితం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
అన్నాడీఎంకే చీఫ్ దివంగత జయలలితకు అత్యంత సన్నిహితుల్లో పన్నీర్ సెల్వం ఒకరు. 1973లో AIDMK సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన పన్నీర్ సెల్వం.. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఐతే 2001లో సుప్రీంకోర్టు జయలలితకు జైలు శిక్ష వేయడంతో పన్నీర్‌కు ఫస్ట్ టైం సీఎం పదవి అధిష్టించే అవకాశం వచ్చింది. ఐతే 2014 సెప్టెంబర్‌లో అక్రమాస్తుల కేసులో కోర్టు జయలలితను దోషిగా నిర్ధారించడంతో పన్నీర్‌కు రెండోసారి సీఎంగా అవకాశం దక్కింది. రెండుసార్లు సీఎంగా చేసిన పన్నీర్‌ని ఇప్పుడు అత్యంత దారుణంగా పార్టీ నుంచి గెంటేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..