22 ఏళ్లలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన మహిళలు 31 మందే

| Edited By: Pardhasaradhi Peri

Feb 10, 2020 | 2:50 PM

ఢిల్లీ అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా 1993 లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి  22 సంవత్సరాల్లో 20 మంది కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలయ్యారు. (నిజానికి ఇది హయ్యెస్ట్ నెంబర్ అట).  1993 లో తొలి అసెంబ్లీలోను, 1998 నాటి రెండో శాసన సభలోను బీజేపీ నుంచి ప్రతిసారీ ఒక్క మహిళా ఎమ్మెల్యే మాత్రమే ఎన్నికవుతూ వచ్చారు.  ఆ తరువాత మరే ఇతర పార్టీ నుంచి ఒక్క మహిళ కూడా ఈ శాసన సభకు ఎన్నిక కాలేదు. 1993 లో […]

22 ఏళ్లలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన మహిళలు 31 మందే
Follow us on

ఢిల్లీ అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా 1993 లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి  22 సంవత్సరాల్లో 20 మంది కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలయ్యారు. (నిజానికి ఇది హయ్యెస్ట్ నెంబర్ అట).  1993 లో తొలి అసెంబ్లీలోను, 1998 నాటి రెండో శాసన సభలోను బీజేపీ నుంచి ప్రతిసారీ ఒక్క మహిళా ఎమ్మెల్యే మాత్రమే ఎన్నికవుతూ వచ్చారు.  ఆ తరువాత మరే ఇతర పార్టీ నుంచి ఒక్క మహిళ కూడా ఈ శాసన సభకు ఎన్నిక కాలేదు. 1993 లో ముగ్గురు మహిళలు ఎన్నిక కాగా-వారిలో ఇద్దరు కాంగ్రెస్ నుంచి, మరొకరు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కృష్ణ తీరథ్ ను ఈ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా నిలబెట్టింది.

1998 లో షీలా దీక్షిత్ మొదటిసారి ఢిల్లీ సీఎం అయ్యారు. అప్పుడు ఎక్కువమంది మహిళలు ఎమ్మెల్యేలయ్యారు. శాసనసభకు ఎన్నికైన తొమ్మిది మంది మహిళల్లో ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా.. బీజేపీకి చెందిన సుష్మ స్వరాజ్ హౌస్ ఖాస్ నియోకజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. 1998 లో అసెంబ్లీ ఎన్నికల ముందు సుష్మ కొద్దికాలం సీఎంగా వ్యవహరించారు. 2003 లో ఏడుగురు, 2008లో ముగ్గురు, 2013 లోనూ ముగ్గురు మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.   2015 లో ఆరుగురు ఎమ్మెల్యేలయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 79 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. వీరిలో 24 మంది కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలకు చెందినవారు.