ఇక జాప్యం వద్దు, జేఈఈ, నీట్ పరీక్షలపై ప్రధానికి విద్యావేత్తల లేఖ

| Edited By: Anil kumar poka

Aug 27, 2020 | 10:20 AM

జేఈఈ, నీట్ పరీక్షలపై ఇంకా జాప్యం చేయడం తగదని, ఆలస్యం చేస్తే విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడినట్టే అవుతుందని పేర్కొంటూ 150 మందికి పైగా విద్యావేత్తలు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ఇక జాప్యం వద్దు, జేఈఈ, నీట్ పరీక్షలపై ప్రధానికి విద్యావేత్తల లేఖ
Follow us on

జేఈఈ, నీట్ పరీక్షలపై ఇంకా జాప్యం చేయడం తగదని, ఆలస్యం చేస్తే విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడినట్టే అవుతుందని పేర్కొంటూ 150 మందికి పైగా విద్యావేత్తలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వీరిలో భారత విశ్వవిద్యాలయాలకు చెందినవారే కాక, విదేశీ యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు కూడా ఉన్నారు. కోవిడ్ కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేయాలని అనేకమంది తమ రాజకీయ ప్రయోజనం కోసం డిమాండ్ చేస్తున్నారని వారన్నారు. కానీ విద్యార్థుల భవిష్యత్తుతో వారు ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ పరీక్షల తేదీలను కూడా ప్రకటించిందన్నారు. ఈ యూనివర్సిటీల్లో ఢిల్లీ, లక్నో యూనివర్సిటీలతో బాటు లండన్ యూనివర్సిటీ వంటి ఫారిన్ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి.