
పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ శశి థరూర్‌పై కాంగ్రెస్ మండిపడింది. శశి థరూర్‌ను భారీ మెజారిటీతో ఓడించి 24 సంవత్సరాలలో పార్టీకి గాంధీయేతర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మల్లికార్జున్ ఖర్గే . ఏఐసీసీ కార్యాలయంలో కౌంటింగ్ జరుగుతుండగా థరూర్ వర్గం “అత్యంత తీవ్రమైన అక్రమాలకు” ఫిర్యాదు చేస్తూ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాసింది. అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని బాంబు పేల్చారు. పెద్ద ఎత్తున రిగ్గింగ్ కూడా జరిగిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ ఎలక్షన్ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీకి శశి ఏజెంట్ సల్మాన్ సోజ్ ఫిర్యాదు చేశారు. అలాగే అక్రమాలకు సంబంధించి ఫోటోలు, ఆధారాలను కూడా సమర్పించారు. ఖర్గే ఎన్నిక లాంఛనమే అని పార్టీ వర్గాలు భావిస్తున్న వేళ.. శశిథరూర్ ఫిర్యాదు ఆసక్తికరంగా మారింది. అయితే ఆ లేఖ లీక్ అయినందుకు థరూర్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పటికీ.. కాంగ్రెస్ కౌంటర్ తీవ్రంగా ఉంది.
ఇదిలావుంటే.. ఎన్నికల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీ గురువారం శశిథరూర్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. థరూర్ తరఫున పనిచేసిన పోల్ ఏజెంట్‌కి బదులిస్తూ మధుసూధన్ మిస్త్రీ స్పందిస్తూ, “మా సమాధానాలన్నింటికీ మీరు సంతృప్తి చెందారని, మాపై ఆరోపణలు చేసిన మీడియాలో భిన్నమైనంగా వచ్చిందని చెప్పడానికి నేను చింతిస్తున్నానని థరూర్ బృందానికి మధుసూధన్ మిస్త్రీ మరో లేఖలో పేర్కొన్నారు. అయితే మీ అభ్యర్థనను అంగీకరించాం, అయినప్పటికీ మీరు కేంద్ర ఎన్నికల అథారిటీ మీపై కుట్ర పన్నుతున్నట్లు ఆరోపిస్తూ మీడియాకు వెళ్ళారు. ఇది సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో “అక్రమాల”పై ఆందోళన వ్యక్తం చేస్తూ థరూర్ బృందం ఫిర్యాదుపై తాము పరిశీలించినట్లుగా తెలిప్పారు. వారి ఫిర్యాదులో ఎలాంటి ఆధారం లేవన్నారు. పోలింగ్‌లో ఎలాంటి పక్షపాతం చూపించలేదని అన్నారు.
అంతకుముందు అక్టోబర్ 19న లక్నోలో ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని థరూర్ ఆరోపించారు. పార్టీ ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం థరూర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ “మా పార్టీ 22 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించలేదు. ఈ తరహా ఎన్నికల్లో అవాంతరాలు తప్పలేదు. నాయకత్వం పెద్దగా ఖర్గేతో కొనసాగింది. మీకు మార్పు, కొనసాగింపు మధ్య ఎంపిక ఉంటే ఆశ్చర్యం లేదు. మీరు కొనసాగింపులో భాగమైతే మీరు ఎందుకు మార్పును కోరుకుంటున్నారు అంటూ థరూర్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
#WATCH: Our party didn’t hold polls for 22yrs. In election of this nature, there were bound to be glitches. Leadership by &large stayed with Mr Kharge, it’s not surprising if you’ve choice b/w change & continuity & if you’re part of continuity why’d you want change:Shashi Tharoor pic.twitter.com/6CNUW529jZ
— ANI (@ANI) October 19, 2022
అయితే, ఫలితాల తర్వాత ఓటమిని అంగీకరించిన థరూర్.. ఖర్గేను అభినందించారు. ఆయన పార్టీకి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారని ఆశిస్తూ, పార్టీకి నాయకత్వానికి పదవీ విరమణ చేసిన అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం