గోవులను తరలిస్తున్నారంటూ.. 25మందిని బంధించి

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఖండ్వా జిల్లాలోని సవాలికేడా గ్రామంలో గోవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ 25మందిపై గోరక్షక సభ్యులు దాడి చేశారు. వారిని తాళ్లతో కట్టేసి.. గుంజీలు తీయిస్తూ.. బలవంతంగా భారత్ మాతా కీ జై.. గో మాతా కీ జై అనే నినాదాలు చేయించారు. ఆ తరువాత వారిని 2కి.మీల దూరంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లి.. పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక […]

గోవులను తరలిస్తున్నారంటూ.. 25మందిని బంధించి

Edited By:

Updated on: Jul 08, 2019 | 4:17 PM

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఖండ్వా జిల్లాలోని సవాలికేడా గ్రామంలో గోవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ 25మందిపై గోరక్షక సభ్యులు దాడి చేశారు. వారిని తాళ్లతో కట్టేసి.. గుంజీలు తీయిస్తూ.. బలవంతంగా భారత్ మాతా కీ జై.. గో మాతా కీ జై అనే నినాదాలు చేయించారు. ఆ తరువాత వారిని 2కి.మీల దూరంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లి.. పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ ఘటనపై స్థానిక పోలీసులు గోవులను తరలిస్తోన్న వారితో పాటు గోసంరక్షకులపైన కేసు నమోదు చేశారు. వీరి నుంచి 21వాహనాలకు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గో అక్రమ రవాణా పేరుతో జరుగుతున్న దాడులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీలో ఈ దాడులకు వ్యతిరేకంగా బిల్లు పెట్టేందుకు కమల్‌నాథ్ సర్కార్ సిద్ధమౌతోన్న విషయం తెలిసిందే.

Follow Us