రిలీజ్ టైంకి.. ఆ ఇద్దరు మాజీ సీఎంలకు కేంద్రం మరో షాక్.. ఈ సారి..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం జమ్ముకశ్మీర్‌పై ప్రత్యేక దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు.. వేర్పాటు వాదులను గృహ నిర్భందం చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిలో కొందర్ని కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు. మరికొందర్ని మాత్రం.. అలా నిర్భందంలోనే కొనసాగించారు. వారిలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఉన్నారు. కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్‌లో […]

రిలీజ్ టైంకి.. ఆ ఇద్దరు మాజీ సీఎంలకు కేంద్రం మరో షాక్.. ఈ సారి..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం జమ్ముకశ్మీర్‌పై ప్రత్యేక దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు.. వేర్పాటు వాదులను గృహ నిర్భందం చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిలో కొందర్ని కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు. మరికొందర్ని మాత్రం.. అలా నిర్భందంలోనే కొనసాగించారు. వారిలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఉన్నారు.

కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి వారిద్దరినీ ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రివెంటివ్ కస్టడీకి తీసుకున్నారు. అయితే ఈ కస్టడీ గడువు ఆరు నెలు కావడంతో.. అది కాస్త మరికాసేపట్లో ముగియనుందనగా.. వారికి మరో షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక నిర్భందం నుంచి బయటకు వస్తారనుకున్న తరుణంలో.. వారిద్దరిపై ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ)ను ప్రయోగించింది. దీంతో వారిని మరో ఆరు నెలలపాటు గృహ నిర్బంధం చేసేసింది. ఓ స్థానిక మెజిస్ట్రేట్‌ గురువారం ఉదయం.. నిర్భందంలో ఉన్న ఇద్దరు మాజీ సీఎంల నివాసాలకు వెళ్లి తాజా ఉత్తర్వులను అందించారు.

మరోవైపు ఎమ్మెల్యే హాస్టల్‌ నుంచి నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలు సజద్‌ లోన్‌, వహీద్‌ పరాలను బుధవారం రోజున విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. సీనియర్‌ ఎన్‌సీ నేత అలి మహ్మద్‌, పీడీపీ నేత సర్తాజ్‌ మద్నీలను ఎమ్మెల్యే హాస్టల్‌ నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అధికారుల నిర్బంధంలోకి వెళ్లిన తర్వాత తొలిసారిగా.. మాజీ సీఎం ఒమర్ ఫోటో జనవరి 25న బయటికి వచ్చింది. అందులో ఆయనను ఎవరూ గుర్తుపట్టలేకుండా ఉన్నారు. ఫోటో చూసిన నెటిజన్లు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా స్పందించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu