India Corona: కోలుకుంటున్న వారి కంటే వైరస్ సోకిన వారే ఎక్కువ.. ఆందోళనకరంగా గణాంకాలు

దేశంలో కరోనా(Corona in India) కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపించింది. ఆదివారం 2.78 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,706 మందికి...

India Corona: కోలుకుంటున్న వారి కంటే వైరస్ సోకిన వారే ఎక్కువ.. ఆందోళనకరంగా గణాంకాలు
Corona
Image Credit source: Corona

Updated on: May 30, 2022 | 10:39 AM

దేశంలో కరోనా(Corona in India) కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపించింది. ఆదివారం 2.78 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,706 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.97 శాతానికి పెరిగింది. వైరస్ నుంచి మరో 2,070 మంది కోలుకున్నారు. 25 మంది ప్రాణాలు విడిచారు. దేశంలో ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి కరోనా సోకగా అందులో 98.74 శాతం మంది వైరస్‌ ను జయించారు. కరోనా కారణంగా ఇప్పటివరకు 5,24,611 మంది మరణించారు. కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారు తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా యాక్టీవ్ కేసులు 17,698(0.04 శాతం) కు చేరాయి. ఇప్పటివరకూ 193 కోట్ల డోసులు టీకా పంపిణీ అయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు.. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్(Monkeypox) కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వైరస్ కేసులతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ మంకీపాక్స్ వైరస్ నిర్ధరణ కాగా తాజాగా మెక్సికో(Mexico), ఐర్లాండ్‌(Ireland) దేశాల్లోనూ తొలి కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన 50 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ ను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. అంతే కాకుండా ఐర్లాండ్‌లోనూ మంకీపాక్స్ తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే మంకీపాక్స్‌కు అంతలా భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us