Odhisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం తరహాలో మరో ప్రమాదం జరుగుతుంది.. కలకలం రేపుతున్న ఓ ఆగంతకుడి లేఖ

ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఆగంతకుడు రైలు ప్రమాదానికి సంబంధించి రాసిన లేఖ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒడిశాలో జరిగినట్లుగానే మరో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని తెలిపాడు.

Odhisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం తరహాలో మరో ప్రమాదం జరుగుతుంది.. కలకలం రేపుతున్న ఓ ఆగంతకుడి లేఖ
Odisha Train Tragedy

Updated on: Jul 04, 2023 | 9:34 AM

ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఆగంతకుడు రైలు ప్రమాదానికి సంబంధించి రాసిన లేఖ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒడిశాలో జరిగినట్లుగానే మరో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని తెలిపాడు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్, డీఆర్ఎమ్ పేరు మీద ఓ గుర్తు తెలియని వ్యక్తి జూన్ 30 న రాసిన ఈ లేఖ సోమవారం నాడు రైల్వే అధికారుల వద్దకు చేరింది. బాలాసోర్ లాంటి మరో రైలు ప్రమాదం జరుగుతుందని ఆ లేఖలో చెప్పాడు. రాబోయే వారం రోజుల్లో హైదరాబాద్ – ఢిల్లీ – హైదరాబాద్ రూట్లో ఈ ప్రమాదం పొంచిఉందని తెలిపాడు.

తనకు సమాచారం నమ్మకమైన వర్గాల ద్వారా వచ్చిందని పేర్కొన్నాడు. ఇది చూసిన అధికారులు వెంటనే రైల్వే, జీఆర్పీ పోలీసులకు సమాచారం తెలిపారు. త్వరగా విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ లేఖ రాసిన ఆగంతకుడు వివరాలు సేకరించేందుకు రంగంలోకి దిగారు. అలాగే ఈ లేఖపై ఉత్తరమండలం డీసీపీ చందనదీప్తి కూడా స్పందించారు. మూడు రోజుల క్రితమే ఈ లేఖపై తమకు సమాచారం వచ్చిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..