బైక్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణించిన మంత్రి, ఎమ్మెల్యే.. పోలీసులు ఏం చేశారంటే..?

|

Jun 25, 2022 | 9:34 PM

ప్రస్తుతం ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో అక్కడి ట్రాఫిక్‌ పోలీసుల పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు.

బైక్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణించిన మంత్రి, ఎమ్మెల్యే.. పోలీసులు ఏం చేశారంటే..?
Minister Mla
Follow us on

చట్టం ఎవరికీ చుట్టం కాదు.. అందరూ సామానులే అని నానుడిని అక్కడి పోలీసులు అక్షరాల నిజం చేశారు. ట్రాఫిక్‌ రూల్‌ పాటించలేదని ఏకంగా రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా విధించారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో అక్కడి ట్రాఫిక్‌ పోలీసుల పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఒడిశాలోని బాలేశ్వర్​ ట్రాఫిక్​ పోలీసులు చేసిన పనికి ఇప్పుడు నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తుంది. హెల్మెట్​ లేకుండా బాలేశ్వర్ శాసనసభ్యుడు స్వరూప్ దాస్​ బైక్​ను నడిపారు. ఆయనతో పాటు బైక్​పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ కూడా ఉన్నారు. హెల్మెట్​ లేకుండా బైక్​ నడిపినందుకు ఎమ్మెల్యేకు రూ.1000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఒడిశా విద్యాశాఖ మంత్రికి జరిమానా అనంతరం ఎమ్మెల్యే స్వరూప్​ దాస్ స్థానిక​ ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫైన్‌ కట్టి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

ఎమ్మెల్యే స్వరూప్ దాస్​తో కలిసి బాలేశ్వర్​లోని పట్టణంలోని వివిధ పాఠశాలల్లో మంత్రి అకస్మిక తనిఖీలు నిర్వహించారు. బాలేశ్వర్ టౌన్​ హైస్కూల్, బారాబతి బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలా మొత్తానికి హెల్మెట్‌ లేదని ట్రాఫిక్‌ పోలీసులు ఎమ్మెల్యేను కూడా వదలలేదు. వాళ్లు చేసిన పని చూసి చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించి ఫైన్ కట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి