సకాలంలో అప్పు చెల్లించలేదని 22 ఏళ్ల యువకుడిని స్కూటర్‌కు కట్టేసి రద్దీగా ఉండే రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. ఈ దారుణ సంఘటన ఒడిశాలో జరిగింది. ఓ యువకుడి చేతుల్ని తాడుతో కట్టేసి..ఆ తాడును స్కూటర్‌కి కట్టి దాదాపు రెండున్నర కిలోమీటర్లు లాక్కెక్కారు. ఈ ఘటనలో నడిరోడ్డుపై ఇంతటి దారుణానికి పాల్పడ్డ యువకులను గుర్తించామన్నారు పోలీసులు. బాధితుడిని జగన్నాథ్ బెహరాగా గుర్తించారు. అయితే, 1500 రూ. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో..నిందితులు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. యువకుడిని స్కూటీకి కట్టేసి సుమారు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. స్కూటీ వెనుక యువకుడు పరుగెత్తుతున్న దృశ్యాన్ని పక్కనే ఉన్న వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి రికార్డు చేశాడు.
ఈ ఘటన ఒడిశాలోని కటక్‌లో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తరువాత, కొంతమంది స్థానికులు వచ్చి సుతాహత్ స్క్వేర్ వద్ద 22 ఏళ్ల యువకుడిని రక్షించారు. బెహరా గత నెలలో తన తాతయ్య అంత్యక్రియల నిమిత్తం ఇద్దరి నుంచి రూ.1500 లు అప్పుగా తీసుకున్నాడు. అయితే తీసుకున్న ఆ మొత్తం తిరిగి ఇవ్వడంలో ఆలస్యం అయింది. దీంతో ఇదిగో ఇలా పనిష్మెంట్ ఇచ్చారు. 1500 కోసం ఇంత దారుణానికి పాల్పడ్డ నిందితులను శిక్షించాలని కోరుతున్నారు స్దానికులు.
Horrific | Man tied to a two-wheeler and made to run for about two kilometers on a busy road just because he failed to repay Rs 1,500 on time #Cuttack pic.twitter.com/QgGp49n33S
— Raju Kumar (@rajudelhi123) October 18, 2022
కాగా, జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూటర్‌పై ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై అక్రమ నిర్బంధం, కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు కటక్ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పినాక్ మిశ్రా తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి