Corona Mask: దేశంలో కరోనా తీవ్రతరం అవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. చాపకింద నీరులా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిలో భాగంగా ఒడిశా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు కఠినమైన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా మాస్క్ ధరించని వారిపై భారీగా జరిమానా విధిస్తోంది. తొలిసారి, రెండో సారి మాస్క్ ధరించకపోతే రూ.2వేలు, అదే తప్పు మళ్లీ చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరో వైపు ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశంలోని ఎక్కడి నుంచైనా ఒడిశాకు వచ్చే ప్రయాణికులు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి అని ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పష్టం చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న నివేదిక లేదా టీకా వేయించుకున్నట్లు ధృవీకరణ పత్రం చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒక వేళ ఎవరైనా సరైన పత్రాలు చూపించకపోతే ఏడు రోజులు క్వారంటైన్ తప్పనిసరి పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఒడిశాలో ఇప్పటి వరకు 3 ,45,526కు చేరగా, మరణాలు 3,38,900లకుపైగా చేరాయి.
ఇప్పటికే మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించేలా ఆలోచనలు చేస్తున్నాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనాపై లెక్కలు బయటపెడుతున్నాయి. వైరస్‌లో మార్పుల (మ్యుటేషన్ల) కారణంగా దాని వ్యాప్తి గతంలో కంటే మరింత తీవ్ర స్థాయిలో పెరిగింది. భారత్‌లో గత ఏడాది మొదటి వేవ్‌లో కేసులు తారస్థాయికి చేరడానికి ఏడు నెలల సమయం పడితే.. సెకండ్ వేవ్ కేవలం రెండు నెలల్లోనే కేసులు ఆ స్థాయికి చేరుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
సెకండ్ వేవ్‌లో గత వారంలో భారత్‌లో 5.13 లక్షల కేసులు నమోదు కాగా, అదే వారంలో 3,071 మరణాలు సంభవించాయి. మొదటి వేవ్ తీవ్రత సమయంలో ఎలాంటి భయానక పరిస్థితి ఉందో ఇప్పుడు అలాంటి తీవ్రతే ఉందని డబ్ల్యూహెచ్ వో చెప్పుకొచ్చింది.
Covid-19: కరోనా పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వైద్యులు, వైద్య సిబ్బందికి శుభవార్త