Bhuvaneshwar cancer care hospital:
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తునన ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భువనేశ్వర్‌లో ప్రపంచస్థాయి అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు శుభ్రత్ బగ్చి, ఆయన భార్య సుస్మిత బగ్చిలు రూ.340 కోట్లను విరాళంగా ప్రకటించారు. శుభ్రత్ బగ్చి నిధుల నుంచి రూ.210 కోట్లు, సుస్మిత నిధుల నుంచి రూ.130 కోట్లు కేటాయిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
పేద వారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన క్యాన్సర్ వైద్యం అందించేందుకు తలపెట్టిన ఈ అత్యాధునిక ఆసుపత్రి కోసం భువనేశ్వర్ ఇన్ఫోసిటీ-2 వద్ద 20 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా కేటాయించనుంది. బెంగళూరుకు చెందిన శంకర క్యాన్సర్ ఆసుపత్రి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఏర్పాటు కానున్న ఈ ఆసుపత్రి నిర్మాణానికి బగ్చి-శంకర క్యాన్సర్ కేర్ ఆసుపత్రిగా నామకరణం చేశారు. అన్ని వసతులు పూర్తి చేసుకున్న ఆసుపత్రి 2024 నాటికి ఇది ప్రారంభం కానుంది.
బెంగళూరుకు చెందిన శ్రీ శంకర క్యాన్సర్ కేర్ ఫౌండేషన్, దాతృత్వ సాధనతో స్వచ్ఛంద సంస్థ, ఆసుపత్రిని స్థాపించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. మైండ్‌ట్రీ సహ వ్యవస్థాపకుడు, ఒడిశా నైపుణ్య అభివృద్ధి అథారిటీ చైర్మన్ సుబ్రోటో బాగ్చి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 210 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆయన భార్య సుస్మితా బాగ్చి రూ.130 కోట్లు నిధులు అందజేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రతిపాదన ప్రకారం, క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రారంభంలో 250 పడకలతో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోనుంది. ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 2024 నాటికి అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంతో శ్రీ శంకర క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తరువాత, దీనిని 500 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దనున్నారు. అధునాతన అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణతో, ఆసుపత్రి 25% పడకలను ఉచిత చికిత్స కోసం, వివిధ ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద రోగులకు మరో 25% పడకలను కేటాయించాలని ప్రతిపాదించింది. మిగిలిన 50% మంది ఇతర రోగులు సేవలకు అందించనున్నారు. అంతేకాదు ఆసుపత్రి ద్వారా వచ్చే ఆదాయాన్ని మరిన్ని సేవల విస్తరణకు, పేద రోగులకు సహాయపడటానికి ఉపయోగించనున్నారు.
“ఇది శస్త్రచికిత్స, వైద్య, రేడియేషన్ ఆంకాలజీ, ఇమేజింగ్ న్యూక్లియర్ మెడిసిన్, పీడియాట్రిక్,హేమాటో-ఆంకాలజీ ఉపిరితిత్తుల వ్యాధికి సంబంధించి సేవలను ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి రానుంది. ప్రధాన విభాగాలతో పాటు విద్యా , పరిశోధనా సౌకర్యాలతో కూడిన ఆంకాలజీ కేంద్రంగా ఉంటుంది” అని ప్రభుత్వం తెలిపింది.
అంతేకాకుండా, భువనేశ్వర్ వద్ద బాగ్చి-కరుణాశ్రయ పాలియేటివ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒడిశా రాష్ట్రంలో ఇది మొదటిది కావడం విశేషం. ఈమేరకు బాగ్చి దంపతులతో బెంగళూరుకు చెందిన కరుణశ్రమ హోస్పైస్ ట్రస్ట్‌లు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. హాస్పిటల్ ఆధారిత పాలియేటివ్ కేర్ కాకుండా, ఈ కేంద్రం ఇళ్లలో కూడా సేవలను అందిస్తుంది. కొత్త కేంద్రం స్థానిక వైద్యులు, ఆరోగ్య సంరక్షణ, ఉపశమన సంరక్షణపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.