ఆ రాష్ట్రంలో మహిళలు ముందుగా బస్సు ఎక్కితే అపశకునం.. వింత విధానాన్ని పాటిస్తున్న సిబ్బంది

|

Jul 29, 2023 | 8:02 AM

చాలామంది ఇప్పటికీ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు.. వాటిని పాటిస్తున్నారు. అయితే ఒడిశాలో మాత్రం ఇది తారాస్థాయికి చేరింది. మూఢనమ్మకాలు అక్కడ చివరికి ఆర్టీసీ బస్సుల వరకు చేరాయి. మహిళలు మొదటగా బస్సు ఎక్కిచే అపశకునంగా భావిస్తున్న దుస్థితి నెలకొంది.

ఆ రాష్ట్రంలో మహిళలు ముందుగా బస్సు ఎక్కితే అపశకునం.. వింత విధానాన్ని పాటిస్తున్న సిబ్బంది
Bus
Follow us on

చాలామంది ఇప్పటికీ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు.. వాటిని పాటిస్తున్నారు. అయితే ఒడిశాలో మాత్రం ఇది తారాస్థాయికి చేరింది. మూఢనమ్మకాలు అక్కడ చివరికి ఆర్టీసీ బస్సుల వరకు చేరాయి. మహిళలు మొదటగా బస్సు ఎక్కిచే అపశకునంగా భావిస్తున్న దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఈ కాలంలో కూడా అక్కడ మహిళల పట్ల మూఢనమ్మకాలు ప్రదర్శించడం అందిరిని ఆశ్చర్యానకి గురిచేస్తోంది. బస్సులో అందరికంటే ముందు మహిళలు ఎక్కితే ఆ బస్సుకు ప్రమాదం జరుగుతుందని లేకపోతే ఆదాయం తక్కువ వస్తుందని నమ్ముతున్నారు. వివరాల్లోకి వెళ్తే భువనేశ్వర్‌లోని బర్ముండ బస్టాండ్‌లోని మల్కాన్ గిరి అనే ప్రాంతం వెళ్లేందుకు ఓ యువతి ఎదురుచూస్తోంది.

బస్సు రావడంతో ఆ యువతి అందరికంటే ముందుగా బస్సు ఎక్కబోయింది. కానీ ఇది గమనించిన బస్సు కండక్టరు ఆమెను బస్సు ఎక్కకుండా కొద్దిసేపు ఆపింది. ముందుగా అందులో పురుషుడు ఎక్కిన తర్వాత ఆమెను లోపలికి అనుమతించింది ఆ కండక్టర్. అయితే ఇదంతా అక్కడ ఉండి గమనించిన సామాజిక కార్యకర్త ఘసిరా పండా రాష్ట్ర మహిళ కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలను అపశకునంగా భావిస్తున్నారని మండిపడ్డారు. బస్సు కండక్టర్ ప్రవర్తించిన తీరు హేయనీమైనదని.. బస్సులో ముందుగా మహిళలను ఎక్కించకపోవడం ఆటవిక చర్యగా పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన మహిళా కమిషన్ అధ్యక్షురాలు మినతి బెహరా వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన సహాయ కమిషనర్ లాల్ మోహన్ శెఠి ప్రభుత్వం, ప్రవేటు బస్సుల్లోకి మహిళలు ముందుగా వస్తే వారిని అనుమతించాలని ఆదేశించారు. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.