నిరుద్యోగులకు గమనిక: ఈ ఉద్యోగ దరఖాస్తులకు 2 రోజులే గడువు..

ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ఉద్యోగాల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఈ నెల 31తో ముగియనుంది. 250 ఇంజినీర్,..

నిరుద్యోగులకు గమనిక: ఈ ఉద్యోగ దరఖాస్తులకు 2 రోజులే గడువు..

Updated on: Jul 29, 2020 | 1:28 PM

ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ 275 ఉద్యోగాల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఈ నెల 31తో ముగియనుంది. 250 ఇంజినీర్, 25 అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ కనీసం 60శాతం మార్కులతో పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 300 దరఖాస్తు ఫీజు కాగా..ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

ఇకపోతే, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీటెక్ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 జూలై 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://ntpccareers.net/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.