NEET UG 2024 Controversy: నీట్ యూజీ పేపర్‌ లీక్‌ ఎఫెక్ట్.. NTA చీఫ్ సుబోధ్ కుమార్ సింగ్‌పై సస్పెండ్ వేటు!

|

Jun 23, 2024 | 12:56 PM

నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ పరీక్షలకు సంబంధించిన వరుస పేపర్‌ లీకుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్‌ను శనివారం రాత్రి పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నీట్ యూజీ 2024 నిర్వహణలో అవకతవకలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా వెళ్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేశారు..

NEET UG 2024 Controversy: నీట్ యూజీ పేపర్‌ లీక్‌ ఎఫెక్ట్.. NTA చీఫ్ సుబోధ్ కుమార్ సింగ్‌పై సస్పెండ్ వేటు!
National Testing Agency Chief Sacked By Centre
Follow us on

న్యూఢిల్లీ, జూన్‌ 23: నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ పరీక్షలకు సంబంధించిన వరుస పేపర్‌ లీకుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్‌ను శనివారం రాత్రి పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నీట్ యూజీ 2024 నిర్వహణలో అవకతవకలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా వెళ్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో 1985 బ్యాచ్ రిటైర్డ్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాను ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ప్రదీప్ సింగ్ కరోలా ఆ పదవిలో కొనసాగనున్నారు.

ఈ ఏడాది మే 5వ తేదీన నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌-పెన్‌ విధానంలో జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు యూజీసీ నెట్‌ పరీక్ష కూడా పరీక్ష పేపర్‌ లీక్‌ జరిగినట్లు రుజువుకావడంతో పరీక్ష జరిగిన 24 గంటల్లోపు ఈ పరీక్షను రద్దు చేశారు. ఇలా రెండు ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రెండు నెలలుగా మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌ సుబోధ్ కుమార్ సింగ్ మీడియాకు దూరంగా ఉండడమేకాకుండా.. లో ప్రొఫైల్ లో కొనసాగుతూ ఉన్నట్లు సమాచారం.

ఎవరీ సుబోధ్ కుమార్ సింగ్?

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుబోధ్ కుమార్ సింగ్.. ఐఐటీ రూర్కేలాలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇగ్నో యూనివర్సిటీలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. సివిల్స్‌ క్లియర్‌ చేసిన ఆయన గతంలో ఛత్తీస్ గఢ్ సెక్రటేరియట్ లో 2009-2019 మధ్య పలు హోదాల్లో పని చేశారు. ఆ తర్వాత ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగం అదనపు సెక్రటరీగా పని చేస్తున్న ఆయన గతేడాది జూన్ లోనే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.