కొత్త ట్విస్ట్…బీజేపీలో చేరడం లేదు… సచిన్ పైలట్

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 10:32 AM

బీజేపీలో తను చేరడంలేదని రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ప్రకటించారు. బీజేపీ చీఫ్ జెపి. నడ్డాతో ఆయన సోమవారం భేటీ అవుతారని, ఆ సందర్భంగా ఆ పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఛానల్ తో మాట్లాడిన ఆయన..

కొత్త ట్విస్ట్...బీజేపీలో చేరడం లేదు... సచిన్ పైలట్
Follow us on

బీజేపీలో తను చేరడంలేదని రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ప్రకటించారు. బీజేపీ చీఫ్ జెపి. నడ్డాతో ఆయన సోమవారం భేటీ అవుతారని, ఆ సందర్భంగా ఆ పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఛానల్ తో మాట్లాడిన ఆయన.. తాను ఈ పార్టీలో చేరడంలేదని చెప్పారు. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యాన జైపూర్ లో జరగనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల ‘భారీ సమావేశానికి’  హాజరు కాకూడదని సచిన్ పైలట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చగలుగుతానని ఆయన చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తూ.. సచిన్ పైలట్ వైపు ఉన్న ఎమ్మెల్యేలు 16 మందేనని స్పష్టం చేసింది. ఈ పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా గమనిస్తోంది. కమలనాథులతో తమ నేత సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయని పైలట్ సన్నిహితులు చెబుతున్నప్పటికీ.. వారితో చర్చలు చురుకుగా లేవని వెల్లడించారు.

అటు-ఈ తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో జైపూర్ లో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ..సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి 109 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని ప్రకటించింది. ఈ మేరకు వీరంతా ఓ లేఖపై సంతకాలు చేసినట్టు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్, ప్రధాన కార్యదర్శి కూడా అయినఅవినాష్ పాండే తెలిపారు.